Skip to content

కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ – 2026 ఘనంగా నిర్వహణ

కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ – 2026 ఘనంగా నిర్వహణ Telugu News
కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ – 2026 ఘనంగా నిర్వహణ Telugu News
కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ – 2026 ఘనంగా నిర్వహణ Telugu News
కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ – 2026 ఘనంగా నిర్వహణ Telugu News

తెలుగు చలనచిత్ర రంగానికి విశిష్ట సేవలందించిన కళాకారులు, సాంకేతిక నిపుణులను సత్కరించేందుకు నిర్వహించిన “కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ – 2026” కార్యక్రమం హైదరాబాద్‌లోని AAA సినిమాస్, అమీర్‌పేట్‌లో ఘనంగా జరిగింది. సినీ, సాంస్కృతిక, సామాజిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి స్మారకార్థం నిర్వహించిన ఈ అవార్డుల వేడుకలో పలువురు సినీ ప్రముఖులకు ప్రతిష్టాత్మక పురస్కారాలు ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APFDC) ఛైర్మన్ భరత్ భూషణ్ గారు, APFDC డైరెక్టర్ మరియు ప్రముఖ నిర్మాత చడలవాడ శ్రీనివాస్ రావు గారు, ఎన్టీఆర్ గారి తనయుడు మరియు ప్రముఖ కొరియోగ్రాఫర్ నందమూరి మోహన కృష్ణ గారు, TFPC కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్ గారు, నిర్మాత పుష్కూర్ రామ్ మోహన్ రావు గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రముఖ నటి ప్రశాంతి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. అలాగే దర్శకుడు వి.ఎన్. ఆదిత్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ వేడుకలో కళావేదిక ఎన్టీఆర్ స్మారక కళారత్న అవార్డును ప్రముఖ నిర్మాత చడలవాడ శ్రీనివాస్ రావు గారికి అందజేశారు. అలాగే కళావేదిక ఎన్టీఆర్ సేవారత్న అవార్డులను శ్రీమతి ఉప్పల స్వప్న గారు, డాక్టర్ అంచుల పవన్ కుమార్ గారికి ప్రదానం చేశారు.

సినీ విభాగంలో ఉత్తమ నటుడిగా ఆది సాయికుమార్, ఉత్తమ వైవిధ్య నటుడిగా ప్రియదర్శి, ఉత్తమ నటిగా శివాని నాగారం, జ్యూరీ ఉత్తమ నటిగా ఆనంది అవార్డులు అందుకున్నారు. ఉత్తమ దర్శకుడిగా రాహుల్ రవీంద్రన్ ఎంపిక కాగా, ఉత్తమ నిర్మాతలుగా పుష్కూర్ రామ్ మోహన్ రావు మరియు సునీల్ నారంగ్ అవార్డులు అందుకున్నారు. ఉత్తమ సహాయ నటిగా లయ సత్కారం పొందారు.

ఈ అవార్డుల ఎంపికలో జ్యూరీ సభ్యులుగా దర్శకుడు సాయి రాజేష్, శైలేష్ కొలను, పద్మావతి మల్లాది, అనుపమ్ రెడ్డి, నందమూరి సీమంతిని, నందమూరి రూప పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ గారిపై ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలు, స్మారక వీడియోలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సినీ ప్రముఖులు మాట్లాడుతూ కళావేదిక నిర్వహిస్తున్న ఈ అవార్డులు తెలుగు సినీ పరిశ్రమకు గౌరవాన్ని తీసుకువస్తున్నాయని అభినందించారు.

ఈ వేడుకను కళావేదిక ప్రతిష్టాత్మకంగా నిర్వహించగా, సినీ అభిమానులు, ఆహ్వానితులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ – 2026 విజేతల జాబితా

🔹 ఉత్తమ నటుడు – ఆది సాయికుమార్
🔹 ఉత్తమ వైవిధ్య నటుడు – ప్రియదర్శి

🔹 ఉత్తమ నటి – శివాని నాగారం
🔹 జ్యూరీ ఉత్తమ నటి – ఆనంది

🔹 ఉత్తమ దర్శకుడు – రాహుల్ రవీంద్రన్

🔹 ఉత్తమ నిర్మాతలు – పుష్కూర్ రామ్ మోహన్ రావు, సునీల్ నారంగ్

🔹 ఉత్తమ సహాయ నటి – లయ

🔹 ఉత్తమ బాలనటి – సుకృతి

🔹 ఉత్తమ సంభాషణ రచయిత – ప్రసన్న కుమార్ బెజవాడ

🔹 ఉత్తమ సంగీత దర్శకుడు & రీ-రికార్డింగ్ – సురేష్ బొబ్బిలి

🔹 ఉత్తమ నేపథ్య గాయకుడు – శ్రీకృష్ణ

🔹 జ్యూరీ ఉత్తమ నేపథ్య గాయకుడు – యాజిన్ నిజార్

🔹 ఉత్తమ నేపథ్య గాయనీ – సమీరా భరద్వాజ్

🔹 ఉత్తమ గేయ రచయిత – నాగ గురునాథ శర్మ

🔹 ఉత్తమ ఛాయాగ్రాహకుడు – సతీష్ మాసం

🔹 ఉత్తమ లెజెండరీ కమెడియన్ అవార్డు – ఆలీ

🔹 ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్ – మనీషా దత్

🔹 ఉత్తమ కొరియోగ్రాఫర్లు – ఆట సందీప్ & జ్యోతి రాజ్

🔹 ఉత్తమ ఆడియో స్టూడియో – SAS శ్రీ అభేరి స్టూడియోస్

🔹 ఉత్తమ ఎగ్జిబిటర్ అవార్డు – తుమ్మల రామబ్రహ్మం చౌదరి

🔹 ఉత్తమ ప్రీమియం మల్టీప్లెక్స్ అవార్డు – AAA సినిమాస్
(జాన్వి నారంగ్ ఆధ్వర్యంలో)

🔹 ఫిల్మ్ స్ట్రాటజిస్ట్ ఆఫ్ ది ఇయర్ – వంశీ నందిపాటి

🔹 ఉత్తమ PRO – తేజస్వి సజ్జా

🔹 కళావేదిక ఎన్టీఆర్ యంగ్ టాలెంట్ అవార్డు (చైల్డ్ ఆర్ట్స్) – కుమారి ప్రణతి పాంపన

🔹 జ్యూరీ ఉత్తమ దర్శకుడు – నవనీత్ శ్రీరామ్

🔹 ఉత్తమ తొలి దర్శకుడు – సాయి మార్తాండ్

🔹 ఉత్తమ తొలి కమెడియన్ – జై కృష్ణ

🔹 ఉత్తమ తొలి సహాయ నటుడు – నరేంద్ర రవి

🔹 ఉత్తమ తొలి ఛాయాగ్రాహకుడు (DOP) – సూర్య బాలాజీ

🔹 ఉత్తమ యాడ్ ఫిల్మ్ దర్శకుడు – జి. సూర్య తేజ

🔹 ఉత్తమ డిజిటల్ మీడియా అవార్డు – శ్రీ శ్రీనివాస్ వోడెనాల

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.