Skip to content

ముద్దం న‌ర‌సింహ స్వామికి ప్రతిష్టాత్మక ‘గౌతమ బుద్ధ సేవారత్న’ అవార్డు ప్రదానం

ముద్దం న‌ర‌సింహ స్వామికి ప్రతిష్టాత్మక ‘గౌతమ బుద్ధ సేవారత్న’   అవార్డు ప్రదానం Telugu News
ముద్దం న‌ర‌సింహ స్వామికి ప్రతిష్టాత్మక ‘గౌతమ బుద్ధ సేవారత్న’   అవార్డు ప్రదానం Telugu News

హైదరాబాద్‌: ఏఐ పుస్తకాల రచయిత, ప్రముఖ జర్నలిస్టు ముద్దం న‌ర‌సింహ స్వామికి ప్రతిష్టాత్మక ‘గౌతమ బుద్ధ సేవారత్న అవార్డు’ ప్రదానం చేశారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికగా జరిగిన TMBMWA 5వ వార్షికోత్సవ వేడుకల్లో ఈ అవార్డును అందజేశారు.
ఈ కార్యక్రమానికి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాశ్, ఎమ్మెల్సీ ఎల్. రమణ, గోపా అధ్యక్షుడు బండి సాయన్న తదితర ప్రముఖులు హాజరయ్యారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తూ మీడియా రంగంలో విశిష్ట సేవలు అందిస్తూ, సమాజానికి తనవంతు సహకారం అందిస్తున్నందుకు ముద్దం న‌ర‌సింహ స్వామిని వేదికపై ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా TMBMWA సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, మీడియా, సాంకేతిక రంగాల్లో ముద్దం న‌ర‌సింహ స్వామి చేస్తున్న సేవలు యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. సమాజంలో సానుకూల మార్పు కోసం ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.