Skip to content

పరమపద సోపానం మంచి విజయాన్ని అందుకుంటుంది – అర్జున్ అంబటి

Arjun 1
Arjun 2
Arjun 3
Arjun

‘అర్ధనారి’ ‘తెప్ప సముద్రం’ ‘వెడ్డింగ్ డైరీస్’ వంటి వైద్యమైన సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ అంబటి.. అటు తర్వాత ‘బిగ్ బాస్’ రియాలిటీ షో ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యారు. అతను హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘పరమపద సోపానం’. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించిన ఈ సినిమాని ‘ఎస్.ఎస్.మీడియా’ సంస్థ పై గుడిమిట్ల సువర్ణలత సమర్పణలో గుడిమిట్ల శివ ప్రసాద్ నిర్మించారు.గుడిమిట్ల ఈశ్వర్ సహా నిర్మాత. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన నాగ శివ ‘పరమపద సోపానం’ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. మాస్ మహారాజ్ రవితేజ ‘ఈగల్’ వంటి భారీ బడ్జెట్ సినిమాతో సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న డేవ్ జాండ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ప్రపంచవ్యాప్తంగా జూలై 11న గ్రాండ్ గా విడుదల కాబోతోంది ‘పరమపద సోపానం’. దీంతో ప్రమోషన్లను వేగవంతం చేసింది చిత్ర బృందం. ఇందులో భాగంగా విడుదల చేసిన ‘చిన్ని చిన్ని తప్పులేవో’ ‘భూమ్ భూమ్’ వంటి లిరికల్ సాంగ్స్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా టీజర్ లాంచ్ వేడుకను కూడా గ్రాండ్ గా నిర్వహించింది చిత్ర బృందం. అగ్ర నిర్మాత సి.కళ్యాణ్ ఈ సినిమా టీజర్ ను లాంచ్ చేసి చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.ఇందులో భాగంగా…

హీరో అర్జున్ అంబటి మాట్లాడుతూ.. ‘నేను ఒక ఫోటో షూట్లో ఉన్నప్పుడు శివ నాకు ఈ కథ చెప్పాడు. అతను చెబుతున్నప్పుడు.. హీరో ఎలివేషన్స్ ఏవైతే ఉన్నాయో.. అవి నాకు పూరి గారి స్టైల్లో అనిపించేవి. అందుకే చాలా ఎక్సైట్ అయ్యాను. వెంటనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. శివ చాలా కష్టపడి ఈ సినిమాని కంప్లీట్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాడు. నిర్మాత శివ ప్రసాద్ గారు కూడా అతని విజన్ కి సహకరించడం వల్లే ఔట్పుట్ బాగా వచ్చింది. కచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’ అంటూ తెలిపారు.

హీరోయిన్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో నేను నేహా అనే పోలీస్ ఆఫీసర్ రోల్ పోషించాను. రెగ్యులర్ హీరోయిన్ టైపు రోల్ కాదిది. కచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుంది అనే నమ్మకం ఉంది’ అంటూ తెలిపారు.

దర్శకుడు నాగ శివ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా ప్రయాణం ఒక కాఫీతో మొదలైంది. నేను నిర్మాత శివ ప్రసాద్ గారు కాఫీ కోసం వెళ్లి చర్చించుకుంటున్న టైంలో ‘పరమపద సోపానం’ ఐడియా చెప్పాను. అది ఆయనకి బాగా నచ్చింది. నేనే ప్రొడ్యూస్ చేస్తాను అంటూ ముందుకొచ్చారు. అలాంటి నిర్మాత దొరకడం వల్లే ఈ ప్రాజెక్టుని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాం. హీరో అర్జున్ కటౌట్ చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ హీరో మెటీరియల్. యాక్షన్ సీన్స్ లో, ఎమోషనల్ సీన్స్ లో తన బెస్ట్ ఇచ్చాడు. జెన్నీ పాత్ర కూడా గుర్తుండిపోతుంది’ అంటూ తెలిపారు.

నిర్మాత శివ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘డైరెక్టర్ నాగ శివ కథ చెప్పిన విధానం బాగా నచ్చింది. కొత్త తరహా కథల్ని ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తున్నారు. ఆ నమ్మకంతో చేసిన సినిమానే ‘పరమపద సోపానం’. కచ్చితంగా ప్రేక్షకులకి ఓ కొత్త అనుభూతి కలిగించే సినిమా అవుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చారు.

డేవ్ జాండ్ మాట్లాడుతూ…. ‘శివ నేను ఎప్పటి నుండో స్నేహితులం, రూమ్ మేట్స్ కూడా..! నాకు చాలా కథలు చెప్పేవాడు. అతను కథలు చెబుతున్నప్పుడు నేను కొన్ని ట్యూన్స్ ఐడియాస్ ‘ఇలా ఉంటే బాగుంటుంది’ అని చెప్పేవాడిని. అవి అతనికి నచ్చేవి. నా ట్యూన్స్ విషయంలో కూడా అతను ఐడియాస్ ఇచ్చేవాడు. అందుకే ‘మా కాంబినేషన్ బాగుంటుంది’ అని అప్పుడే అనిపించింది. కానీ అతను నన్ను మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టి సినిమా చేస్తాడని ఎప్పుడూ ఊహించలేదు. ఇప్పుడు ‘పరమపద సోపానం’ పాటలకి వస్తున్న ఆదరణ నాకు మరింత సంతోషాన్ని ఇస్తుంది’ అంటూ తెలిపారు.

నటీనటులు, సాంకేతిక నిపుణులు :

అర్జున్ అంబటి, జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్

దర్శకత్వం : నాగ శివ

నిర్మాత : గుడిమిట్ల శివప్రసాద్

సహ నిర్మాత : గుడిమిట్ల ఈశ్వర్

నిర్మాణ సంస్థ : ఎస్ ఎస్ మీడియా

సంగీతం : డేవ్ జాండ్

సినిమాటోగ్రఫీ : ఈశ్వర్

లిరికల్ వీడియో : వాల్స్ అండ్ ట్రెండ్స్

పబ్లిసిటీ డిజైనర్ : కృష్ణ ప్రసాద్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : గణపర్తి నారాయణరావు

పీఆర్ఓ : ఫణి కుమార్

డిజిటల్ : బిగ్ ఫిష్ మీడియా

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.