Skip to content

‘సీతా పయనం’ నుంచి ధ్రువ సర్జా ఫస్ట్ లుక్ రిలీజ్

మల్టీ ట్యాలెంటెడ్ అర్జున్ సర్జా దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ 'సీతా పయనం'. శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య అర్జున్, నిరంజన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. అర్జున్, ధ్రువ సర్జా పవర్ ఫుల్ పవర్ ఫుల్ పాత్రల్లో కనిపించనున్నారు. ఈ రోజు ధ్రువ సర్జా బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఆయన ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ధ్రువ సర్జాని యాక్షన్ హల్క్ ప్రజెంట్ చేసిన ఫస్ట్ లుక్ అదిరిపోయింది. ఇప్పటికే విడుదలైన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ చిత్రంలో సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి…

Read more

పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ ట్రైలర్ విడుదల

ఇంతకు ముందెన్నడూ చూడని అవతారంలో తెరపై అగ్ని తుఫాను సృష్టిస్తున్న పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల నిరీక్షణకు తెరపడింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఓజీ' ట్రైలర్ విడుదలైంది. విడుదలైన తక్షణమే ఈ ట్రైలర్, సామాజిక మాధ్యమాల్లో అగ్రి తుఫాను సృషిస్తోంది. సినిమా యొక్క స్థాయిని, శక్తివంతమైన కథని, గొప్ప విజువల్స్‌ను ప్రదర్శిస్తూ.. ట్రైలర్ అద్భుతంగా ఉంది. 2025లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రంగా 'ఓజీ' ఎందుకు ప్రశంసించబడుతుందో ట్రైలర్ పునరుద్ఘాటిస్తుంది. 'ఓజీ' గర్జనకు మూలం పవన్ కళ్యాణ్. ఆయన ఓజాస్ గంభీరగా ఇంతకు ముందెన్నడూ చూడని అవతారంలో తిరిగి వచ్చి.. మరెవరికి సాధ్యంకాని వింటేజ్ స్టైల్, ఆరాతో కట్టిపడేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ను ఇంతటి శక్తివంతమైన పాత్రలో…

Read more

‘ఖుషి’ అప్పుడు చూశాను ఈ జోష్.. ఇప్పుడు ‘ఓజీ’కి చూస్తున్నాను: పవన్ కళ్యాణ్

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'ఓజీ'. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీరగా గర్జించనున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమన్ స్వరకర్తగా వ్యవహరిస్తున్నారు. 'ఓజీ' సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుండి విడుదలైన ఒక్కో కంటెంట్, ఆ అంచనాలను పెంచుతూ వచ్చింది. ప్రస్తుతం భారతీయ సినిమాలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటిగా 'ఓజీ' నిలిచింది. సెప్టెంబర్ 25,…

Read more

‘ఓజీ’ నుండి ‘ఓమి ట్రాన్స్’ విడుదల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా 'ఓజీ' చిత్రం నుండి విడుదలైన 'ఓమి' గ్లింప్స్ కు అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా 'ఓజీ' చిత్ర బృందం, 'ఓమి ట్రాన్స్' యొక్క పూర్తి వెర్షన్‌ను విడుదల చేసింది. 'ఓజీ', 'ఓమి'ల ముఖాముఖి పోరుని సూచించేలా ఈ గీతముంది. ఓజాస్ గంభీరగా పవన్ కళ్యాణ్, ఓమిగా ఇమ్రాన్ హష్మి మధ్య భీకర పోరాటం అద్భుతంగా ఉంటుంది. ఉరుములు, మెరుపులను తలపించే బీట్స్ తో సంగీత సంచలనం తమన్ ఎస్ స్వరపరిచిన 'ఓమి ట్రాన్స్' ఎంతో శక్తివంతంగా ఉండి, నిజంగానే శ్రోతలను ట్రాన్స్ లోకి తీసుకొని వెళ్తుంది. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌కి సంచలనస్పందన రాగా, తాజాగా విడుదలైన ఈ గీతం అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టుగా సినిమాపై…

Read more

బాక్సాఫీస్ నిజమైన ‘ఓజీ’ తిరిగి వచ్చాడు

ఇంకా ట్రైలర్‌ కూడా విడుదల కాకముందే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నూతన చిత్రం 'ఓజీ' ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తూ, తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ప్రీమియర్ ప్రీ-సేల్స్‌లో 1 మిలియన్ డాలర్లను రాబట్టి, ఈ సంచలనాత్మక ఘనతను అత్యంత వేగంగా సాధించిన చిత్రంగా నిలిచింది. పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. తన అసాధారణ క్రేజ్ తో ఎన్నో రికార్డులను ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు 'ఓజీ' తుఫానుతో మరోసారి బాక్సాఫీస్ లెక్కలు సరి చేస్తున్నారు. అభిమానులతో పాటు, ట్రేడ్ వర్గాలు సైతం పవన్ కళ్యాణ్ సృష్టిస్తున్న సరికొత్త రికార్డుల పట్ల ఆసక్తిగా ఉన్నారు. ఓజాస్‌ గంభీర అనే శక్తివంతమైన పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు…

Read more

‘ఓజీ’ చిత్రం నుండి ‘కన్మణి’గా ప్రియాంక అరుల్ మోహన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'ఓజీ'. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఓజాస్‌ గంభీరగా గ్యాంగ్‌స్టర్ అవతార్‌లో కనిపించనున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఓజీ' సినిమా నుంచి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్‌ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. ఈ చిత్రంలో ఆమె కన్మణిని పాత్రలో అలరించనున్నారు. 'ఓజీ' రూపంలో ఓ భారీ యాక్షన్ చిత్రాన్ని వెండితెరపై చూడబోతున్నామనే హామీని ఇప్పటిదాకా విడుదలైన ప్రచార చిత్రాలు ఇచ్చాయి. తాజాగా విడుదలైన ప్రియాంక…

Read more

పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ మొదటి గీతం ‘ఫైర్‌ స్టార్మ్’ విడుదల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శక్తివంతమైన పాత్ర ఓజాస్‌ గంభీరగా అలరించనున్న చిత్రం 'ఓజీ' (They Call Him OG). పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల్లో ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న 'ఓజీ' చిత్రం నుంచి మొదటి గీతం 'ఫైర్‌ స్టార్మ్' విడుదలైంది. ఈ గీతం నిజంగానే ఓ అగ్ని తుఫానులా ఉంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'ఓజీ' చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ భీకరమైన గ్యాంగ్‌స్టర్ అవతార్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి వంటి ప్రముఖ నటీనటులు…

Read more