Skip to content

గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

ప్రముఖ నటుడు అలీ ఓ రియాలిటీ షో షూటింగ్‌ కోసం గోవా వెళ్లారు. అలీ షూటింగ్‌కు వచ్చిన సంగతి తెలుసుకున్న గోవా ముఖ్యమంత్రి మర్యాద పూర్వకంగా వచ్చి తనను కలవాలని అలీకి చెప్పటంతో అలీ ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిశారు. ఈ సందర్భంగా అలీగురించి తెలుసుకున్న ఆయన అలీతో మాట్లాడుతూ దాదాపు 1260 సినిమాల్లో నటించటం అంటే చాలా పెద్ద విషయం అంటూ అలీని పొగడ్తలతో ముంచెత్తారు. అలాగే గోవాలో జరిగే గోవా ఫిలిం ఫెస్టివల్‌ (జిఎఫ్‌ఎఫ్‌) కార్యక్రమానికి అతిథిగా రావాలని అలీని కోరటంతో ముఖ్యమంత్రి ప్రమోద్‌తో ఖచ్చితంగా పాల్గొంటానని మాటిచ్చారు. అంటే ఈ ఏడాది జరిగే ఫిలిం ఫెస్టివల్‌ వేడుకల్లో అలీ పాల్గొంటున్నారన్నమాట.

Read more