Skip to content

“ధర్మవరం” సినిమా పోస్టర్‌ ఆవిష్కరణ

ఈ చిత్రంలో రాజ్ వేంకటాచ్ఛ హీరోగా నటించడంతో పాటు కథ, చిత్రకథ, దర్శకత్వం వహించి, ఓ విభిన్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కథానాయకుడిగా తన అద్భుతమైన నటనతో పాటు దర్శకుడిగా తన ప్రత్యేకమైన ముద్రను వేసేందుకు రాజ్ వేంకటాచ్ఛ ప్రయత్నిస్తున్నారు. ప్రధాన పాత్రల్లో అజయ్, నవీన్ రెడ్డి, సంయోగీత, ఏశాన్ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. గ్రామీణ సాంప్రదాయాలు, సాంస్కృతిక విలువలు, కుటుంబ బంధాలు, భావోద్వేగాలతో నిండిన ఈ సినిమా ప్రేక్షకుల మనసులను అలరించనుందనే నమ్మకాన్ని యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజ్ వేంకటాచ్ఛ మాట్లాడుతూ – “ధర్మవరం సినిమా నాకు ఎంతో ప్రాణమైన ప్రాజెక్ట్‌. ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం మనసుకు హత్తుకునేలా ఉండేలా కష్టపడ్డాం…

Read more

లేత గులాబీ టైటిల్ లాంచ్

79 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శతాధిక చిత్రాల హీరో సుమన్ గారు మరియు శతాధిక చిత్రాల దర్శకులు శ్రీ ఓం సాయి ప్రకాష్ గారు లేత గులాబీ టైటిల్ పోస్టర్ను లాంచ్ చేసి దర్శకుడు మరియు నిర్మాతలను ఆశీర్వదించారు. వారాహి మీడియా హౌస్ సమర్ప ణ లో మీనాక్షి క్రియేషన్స్ బ్యానర్ పై సుందర్ దర్శకత్వంలో శ్రీనివాస్ మరియు ప్రసాద్ నిర్మాతలుగా నిర్మిస్తున్న చిత్రం లేత గులాబి. విభిన్న ప్రేమ కథ తో పాటు సమాజ హిత సందేశాత్మక ఈ చిత్రానికి వెంకట్ బాలగోని సంగీతాన్ని అందిస్తున్నారు. నిర్మాతలు పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తామని మీడియాకు చెప్పారు.

Read more