‘మిత్ర మండలి’ లాంటి హాస్య చిత్రాలను ఆదరించాలి: బ్రహ్మానందం
టీజర్ కు, 'కత్తందుకో జానకి', 'స్వేచ్చా స్టాండు' పాటలకు లభించిన అద్భుతమైన స్పందన తర్వాత.. 'మిత్ర మండలి' చిత్ర బృందం, మూడవ గీతం 'జంబర్ గింబర్ లాలా'ను హైదరాబాద్ లోని వర్ధమాన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా జరిగిన లాంచ్ ఈవెంట్ లో ఆవిష్కరించింది. మీమ్ గాడ్, లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం గారు చిత్ర బృందంతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ వేడుకలో విద్యార్థుల ఉత్సాహం, బ్రహ్మానందం గారి పట్ల ప్రతి ఒక్కరికీ ఉన్న ప్రేమకు నిదర్శనంగా నిలిచింది. https://youtu.be/oRKGTW15Lms లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం మాట్లాడుతూ.. "మిత్ర మండలి వేడుకకు హాజరు కావడం సంతోషంగా ఉంది. కాలేజ్ లో లెచ్చరర్ గా పనిచేస్తున్న సమయంలో ఇంతమంది విద్యార్థులను చూశాను. మళ్ళీ ఇప్పుడు ఇంతమంది…
