తెలుసు కదా నుంచి మల్లిక గంధ లాంచ్
-మల్లారెడ్డి విమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో సాంగ్ ని గ్రాండ్ గా లాంచ్ చేసిన 'తెలుసు కదా' మూవీ టీం స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ రొమాంటిక్ డ్రామా తెలుసు కదా, ప్రముఖ స్టైలిస్ట్ నీరజా కోన దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. థమన్ ఎస్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మేకర్స్ ఫస్ట్ సింగిల్ - మల్లికా గంధను లాంచ్ చేయడం ద్వారా మ్యూజిక్ ప్రమోషన్‌లను ప్రారంభించారు. మల్లికా గంధ లవ్ అండ్ మ్యూజికల్ మ్యాజిక్ తో మనసును తాకే అద్భుతమైన పాట. ట్యూన్, విజువల్స్ ప్రతీదీ ప్రేమ భావోద్వేగాలను బ్యూటీఫుల్ గా ప్రజెంట్ చేస్తోంది…
