Skip to content

షూటింగ్‌ పూర్తి చేసుకున్న హ్రీం…

తెలుగు భీజాక్షరాల్లో ‘హ్రీం’ అనే అక్షరానికి ఎంతో ఉన్నతమైన విలువలతో కూడిన అర్థం ఉంది. ‘హ్రీం’ అనే ఒక్క భీజాక్షరంలో ‘హ’, ‘ర’, ‘ఈ’, ‘మ’ అనే అక్షరాలున్నాయి. హ అంటే ధర్మం, ర అంటే అర్థం, ఈ అంటే కామం, మ అంటే మోక్షం..‘హ్రీం’ అంటే దర్మార్ధ కామ మోక్షాలు కలగలిసిన భీజాక్షరం. ఇప్పటివరకు ఎక్కడా చెప్పని ఒక యదార్థ గాధను ఆధారంగా తీసుకుని ఈ చిత్రానిన తెరకెక్కించారు. శివమ్‌మీడియా పతాకంపై ‘హ్రీం’ అనే భీజాక్షరంతో తయారైన ఈ సినిమాలో నూతన నటీనటులు పవన్‌ తాత, డాక్టర్‌ చమిందా వర్మ జంటగా నటించారు. హారర్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం వరంగల్, హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ‘…

Read more

సందీప్‌కిషన్‌ క్లాప్‌తో ప్రారంభమైన ‘హ్రీం

పవన్‌ తాత, చమిందా వర్మ జంటగా నటిస్తోన్న నూతన చిత్రం ‘హ్రీం’. రాజేశ్‌ రావూరి ఈ చిత్రంతో దర్శకునిగా మారనున్నారు. శివమ్‌ మీడియా పతాకంపై శ్రీమతి సుజాత సమర్పిస్తున్న ఈ చిత్రానికి శివమల్లాల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ప్రముఖ హీరో సందీప్‌కిషన్‌ క్లాప్‌నివ్వగా నటులు అలీ, బెనర్జీ, తెలుగు రాష్ట్రాల్లో టాప్‌ ఆడిటర్‌గా ఉన్న విజయేంద్రరెడ్డి, సినిజోష్‌ అధినేత రాంబాబు పర్వతనేని దర్శకుడు రాజేశ్‌కి స్క్రిప్ట్‌ని అందించారు. నటులు రాజీవ్‌ కనకాల కెమెరా స్విఛాన్‌ చేశారు. చిత్ర ప్రారంభోత్సవం తర్వాత సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ–‘‘ నా తొలి చిత్రం నుండి ఈ చిత్ర నిర్మాతతో పరిచయం ఉంది. నాకున్న అతికొద్ది మంది మీడియా ఫ్రెండ్స్‌లో శివ మల్లాల ఎంతో ముఖ్యుడు…

Read more