యూట్యూబ్ లో ‘ఏయ్ జూడ్’గా పాపులర్ అయిన అజయ్ హీరోగా కొత్త సినిమా ప్రారంభం
యూట్యూబ్ సెన్సేషన్, ‘ఏయ్ జూడ్’గా పాపులర్ అయిన అజయ్ హీరోగా తెరకెక్కనున్న కొత్త సినిమా నేడు అధికారికంగా ప్రారంభమైంది. రాము కొప్పుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నెక్సస్ సినిమాస్, స్కైబ్లేజ్ సిల్వర్ స్క్రీన్ బ్యానర్లపై నెక్సస్ శ్రీధర్, దీపక్ ముస్త్యాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా, ఫహాద్ అబ్దుల్ మజీద్ సినిమాటోగ్రాఫర్గా, క్రాంతి ప్రియమ్ ఆర్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. రామానాయుడు స్టూడియోస్లో సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ వేడుకకు చిత్ర బృందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు, ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. ప్రముఖ దర్శకుడు బి. గోపాల్ గారు కెమెరా స్విచ్ ఆన్ చేయగా, దర్శకుడు హరీష్ శంకర్ గారు తొలి…
