‘లవ్వాలా’ మూవీ గ్రాండ్ గా లాంచ్
రవీంద్ర తేజ్ హీరోగా SVAN ఎంటర్టైన్మెంట్ & శుభకరి ఇన్ఫ్రా&మీడియా బ్యానర్స్ పై సురేష్ వర్మ, సాయి రామ్ నిర్మిస్తున్న చిత్రం'లవ్వాలా'. బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ కొరటాల శివ, బుచ్చిబాబు సానా వద్ద అసోషియేట్ గా పని చేసిన రంజిత్ కుమార్ దేశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రూరల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టొరీగా రూపొందుతున్న ఈ చిత్రంలో అరియా మోడీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈరోజు పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ఘనంగా లాంచ్ చేశారు. డైరెక్టర్ కొరటాల శివ ముహుర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. డైరెక్టర్ బుచ్చిబాబు సానా కెమెరా స్విచ్ ఆన్ చేశారు. కొరటాల శివ, బుచ్చిబాబు సానా మేకర్స్ కు స్క్రిప్ట్ అందజేశారు. పలువురు సినీ…
