‘ధురంధర్ ది రివెంజ్’ ట్రైలర్ మార్చి 7 ఉదయం 11:01 గంటలకు రిలీజ్
కొన్ని వారాలుగా కొనసాగుతున్న అభిమానుల ఉత్సాహం మధ్య రణ్వీర్ సింగ్ నటిస్తున్న భారీ చిత్రం ధురంధర్ ది రివెంజ్ అఫీషియల్ పోస్టర్ను జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ విడుదల చేశాయి. ఈ పోస్టర్లో ట్రైలర్ మార్చి 7 ఉదయం 11:01 గంటలకు విడుదల కానుందని ప్రకటించారు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ట్రైలర్ కోసం ఇప్పటికే భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ జస్కిరత్ సింగ్ రంగీ, హమ్జా రెండు విభిన్న అవతారాల్లో కనిపించనున్నారు. ఈ కథలో ఈసారి సంఘర్షణ మరింత వ్యక్తిగతంగా మారబోతుందని పోస్టర్ సూచిస్తోంది. ధురంధర్ పార్ట్ 1 భారత్తో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా రికార్డు స్థాయి వసూళ్లు సాధించింది. ముఖ్యంగా నార్త్ అమెరికా,…
