‘ఎక్స్ వై’ మోషన్ పోస్టర్ విడుదల
శ్రీ క్రిష్ పిక్చర్స్, శ్రీ ఇంటర్నేషనల్ బ్యానర్లపై రతిక ప్రధాన పాత్రలో సి.వి. కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘ఎక్స్ వై’. డిఫరెంట్ కంటెంట్‌తో రాబోతోన్న ఈ మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ చూస్తుంటే ఇదొక ప్రయోగాత్మక చిత్రమని అర్థం అవుతోంది. కథ ఏంటి? బ్యాక్ డ్రాప్ ఏంటి? అన్న విషయాల్ని రివీల్ చేయకుండా అందరిలోనూన ఆసక్తిని పెంచేలా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. సి.వి. కుమార్ ఎప్పుడూ కూడా పిజ్జా, సూదు కవ్వుమ్, అట్టకత్తి, శరభం, ఇరుది సుట్రు, మాయావన్ లాంటి ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూనే ఉంటారు. దర్శక, నిర్మాతగా సి.వి. కుమార్ మరోసారి ‘ఎక్స్ వై’ అంటూ ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. తాజాగా రిలీజ్…
