Skip to content

‘ఎక్స్ వై’ మోషన్ పోస్టర్ విడుదల

‘ఎక్స్ వై’ మోషన్ పోస్టర్ విడుదల Telugu News

శ్రీ క్రిష్ పిక్చర్స్, శ్రీ ఇంటర్నేషనల్ బ్యానర్లపై రతిక ప్రధాన పాత్రలో సి.వి. కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘ఎక్స్ వై’. డిఫరెంట్ కంటెంట్‌తో రాబోతోన్న ఈ మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ చూస్తుంటే ఇదొక ప్రయోగాత్మక చిత్రమని అర్థం అవుతోంది. కథ ఏంటి? బ్యాక్ డ్రాప్ ఏంటి? అన్న విషయాల్ని రివీల్ చేయకుండా అందరిలోనూన ఆసక్తిని పెంచేలా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.

సి.వి. కుమార్ ఎప్పుడూ కూడా పిజ్జా, సూదు కవ్వుమ్, అట్టకత్తి, శరభం, ఇరుది సుట్రు, మాయావన్ లాంటి ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూనే ఉంటారు. దర్శక, నిర్మాతగా సి.వి. కుమార్ మరోసారి ‘ఎక్స్ వై’ అంటూ ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. తాజాగా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్‌లో కనిపించిన టీ పోసే బౌల్, కెమెరా, మెదడు, డీఎన్ఏ, ఆ తరువాత రాక్షసుడిలా ఓ రూపాన్ని చూపించడం, ఆపై హీరోయిన్ లుక్ చూపించడం, అక్కడ చుట్టూ గర్భంలో ఉన్న శిశువుల్ని చూస్తుంటే ఇదొక డిఫరెంట్ అండ్ న్యూ కంటెంట్ మూవీ అని అర్థం అవుతోంది.

తెలుగు, తమిళ్, మలయాళం ఇలా అన్ని భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ కృష్ణ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాకి హరిహరణ్ ఆనందరాజ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. త్వరలోనే చిత్రానికి సంబంధించిన ఇతర వివరాల్ని ప్రకటించనున్నారు.

తారాగణం: రతిక , బ్రానా , అనిజ్ ప్రబాకర్ , శ్రీదర్ తదితరులు

సాంకేతిక బృందం
బ్యానర్: శ్రీ క్రిష్ పిక్చర్స్ & శ్రీ ఇంటర్నేషనల్
నిర్మాత: ఎం కె సాంబశివం
కథ , దర్శకత్వం: సి.వి.కుమార్
స్క్రీన్ ప్లే & డైలాగ్స్: సి వి కుమార్
సినిమాటోగ్రాఫర్: హరిహరన్ ఆనందరాజా
మ్యూజిక్ కంపోజర్: శ్రీకాంత్ కృష్ణ
ఎడిటర్: పి కె
ఆర్ట్ : ప్రేమ్ కె
పీఆర్వో : సాయి సతీష్ ( Telugu )

Vishwanath

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.