ఘాటి సెకండ్ సింగిల్ దస్సోరా రిలీజ్
క్వీన్ అనుష్క శెట్టి మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా ఘాటి అద్భుతమైన ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు నెక్స్ట్ లెవల్ కి చేరుకున్నాయి. విక్రమ్ ప్రభు మేల్ లీడ్ గా నటించిన ఈ చిత్రానికి విజనరీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. UV క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. మేకర్స్ ఇప్పుడు సినిమా సెకండ్ సింగిల్ దస్సోరాను రిలీజ్ చేశారు. సాగర్ నాగవెల్లి కంపోజ్ చేసిన ఈ సాంగ్ స్టార్ట్ అవగానే ఎనర్జీ, కల్చర్, వైబ్రెన్స్‌తో ఫుల్‌గా మూడ్ బూస్ట్ చేస్తుంది. ఘాటీల జీవన శైలిని, వారి కల్చర్‌ని ట్యూన్ అద్భుతంగా క్యాచ్ చేసింది. ఈఎస్ మూర్తి రాసిన లిరిక్స్…