మోహన్.జి భారీ చిత్రం ‘ద్రౌపతి -2’ ఫస్ట్ లుక్ విడుదల
నేతాజీ ప్రొడక్షన్స్ తరపున చోళ చక్రవర్తి, జి.ఎం.ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా రూపొందిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘ద్రౌపతి -2’. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇది వరకు పళయ వన్నారపేట్టై, ద్రౌపతి, రుద్ర తాండవం, బకాసురన్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన మోహన్.జి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో రిచర్డ్ రిషి, రక్షణ ఇందుసుదన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నట్టి నటరాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇంకా వై.జి.మహేంద్రన్, నాడోడిగల్ భరణి, శరవణ సుబ్బయ్య, వేల్ రామమూర్తి, సిరాజ్ జానీ, దినేష్ లాంబా, గణేష్ గౌరంగ్, దివి, దేవయాని శర్మ, అరుణోదయన్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మోహన్.జి, పద్మ చంద్రశేఖర్…