సత్యవతిగా రీతు వర్మ గ్రేస్‌ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్
మ్యాచో స్టార్ టి గోపీచంద్, విజనరీ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్న హిస్టారికల్ మూవీ #గోపీచంద్33 తో రాబోతున్నారు. పవన్ కుమార్ ప్రజెంట్స్ చేస్తున్న ఈ చిత్రం గోపీచంద్ కెరీర్లోనే అత్యంత భారీ చిత్రాలలో ఒకటిగా రూపొందుతోంది. ఈ చిత్రంలో రీతు వర్మ, టి గోపిచంద్ సరసన కథానాయికగా నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆమె పాత్ర సత్యవతిని ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా పరిచయం చేశారు. పోస్టర్లో రీతూ వర్మ అద్భుతమైన గ్రేస్‌తో పాటు ఫియర్స్, కమాండింగ్ లుక్‌లో కనిపిస్తున్నారు. విల్లు ఎక్కుపెట్టి ఏకాగ్రతతో కనిపిస్తూ, ఒక యోధురాలిలా ధైర్యం, సంకల్పాన్ని ప్రతిబింబిస్తున్నారు…
