Skip to content

భయపెట్టేలా హారర్‌ థ్రిల్లర్‌ ‘ఈషా’ ట్రైలర్‌..

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి లాంటి సూపర్‌హిట్‌ కల్ట్‌ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటి ద్వయం తాజాగా 'ఈషా' పేరుతో ఓహారర్‌ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా ఈ చిత్రాన్నిడిసెంబరు 12న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల రాజు వెడ్స్‌ రాంబాయి చిత్రంతో సూపర్‌హిట్‌ కొట్టిన అఖిల్‌రాజ్‌తో పాటు త్రిగుణ్‌ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్‌ కథానాయిక. సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్‌ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని హెచ్‌వీఆర్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత కేఎల్‌ దామోదర ప్రసాద్‌ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు…

Read more

దీపావళికి నవ్వుల టపాసులు పేల్చనున్న ‘మిత్ర మండలి’

అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదల పండుగ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. ప్రేక్షకులు థియేటర్లలో నవ్వులతో నిండిన దీపావళి పండుగను జరుపుకునేలా.. 'మిత్ర మండలి' చిత్రాన్ని అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. టీజర్‌తో ఆసక్తిని రేకెత్తించి, రెండు చార్ట్‌బస్టర్ పాటలతో అభిమానులను అలరించిన తర్వాత, నిర్మాతలు ఇప్పుడు ఆకట్టుకునే విడుదల తేదీ పోస్టర్‌తో పాటు ఒక వినోదభరితమైన ప్రకటన వీడియోను ఆవిష్కరించారు. బాణసంచా కాల్చడం మరియు గ్యాంగ్ యొక్క ఉత్సాహభరితమైన శక్తితో నిండిన ఈ పోస్టర్ పండుగ వాతావరణాన్ని నెలకొల్పింది. ఇక ప్రకటన వీడియో అయితే నవ్వులు పూయిస్తూ సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది. ప్రేక్షకులకు ఎంతగానో ఎదురుచూస్తున్న నవ్వుల పండుగకు నమూనా…

Read more

మిత్ర మండలి’ నుంచి ‘స్వేచ్ఛ స్టాండు’ విడుదల

'కత్తందుకో జానకి' శైలిలో 'మిత్ర మండలి' నుంచి మరో సరదా గీతం 'స్వేచ్ఛ స్టాండు' ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ స్థాపించిన నిర్మాణ సంస్థ బి.వి. వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'మిత్ర మండలి'. అభిరుచి గల నిర్మాతలు కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంతో సోషల్ మీడియా సంచలనం నిహారిక ఎన్.ఎం. తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, 'కత్తందుకో జానకి' గీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా…

Read more