Skip to content

ఇట్స్‌ ఓకే గురు అందరికీ కనెక్ట్‌ అయ్యే సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది : ప్రీరిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ మెహర్ రమేష్

సాయి చరణ్, ఉషశ్రీ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న చిత్రం 'ఇట్స్ ఓకే గురు'. మణికంఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్రాంతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా డిసెంబర్ 12 రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. 'ఇట్స్ ఓకే గురు' టైటిల్ చాలా బాగుంది. అందరికీ రీచ్ అయింది. కంటెంట్ చూస్తుంటే లవ్ స్టోరీలా అనిపిస్తుంది. విజువల్స్ మ్యూజిక్ అన్ని బాగున్నాయి. లవ్ స్టోరీ కి మ్యూజిక్ విజువల్స్ బాగుంటే 60% సినిమా హిట్ అయినట్టే. సినిమాని మంచిగా ప్రమోట్ చేసి జనాల్లోకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. హీరో…

Read more

కుంభమేళా ఫేమ్ మోనాలిసా ‘లైఫ్’ సినిమా మొదటి షూటింగ్ షెడ్యూల్ పూర్తి

కుంభమేళా ఫేమ్ మోనాలిసా కథానాయికగా నటిస్తున్న చిత్రం లైఫ్. సాయిచరణ్ హీరోగా వెంగమాంబ క్రియేషనర్స్ బేనర్ పై రూపొందుతున్న ఈ సినిమాకి శ్రీను కోటపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అంజన్న నిర్మిస్తున్నారు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. త్వరలోనే రెండో షెడ్యూల్ ప్రారంభించనున్నారు మేకర్స్. ఈ చిత్రంలో సయాజీ షిండే, సీనియర్ నటుడు సురేష్, ఆమని, తులసి, రచ్చ రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. మురళీ మోహన్ రెడ్డి డీవోపీగా పని చేస్తున్నారు. సుకుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. బేబీ సురేష్ ఆర్ట్ డైరెక్టర్. నటీనటులు: మోనాలిసా భోంస్లే, సాయి చరణ్, సయాజీ షిండే, సీనియర్…

Read more

మోనాలిసా కథానాయికగా ‘లైఫ్’ చిత్రం ప్రారంభం

కుంభమేళాలో పూసలమ్ముతూ విశాలమైన కనులతో సోషల్ మీడియా ద్వారా అందరినీ ఆకట్టుకున్న మోనాలిసా తెలుగులో కథానాయికగా మారింది. సాయిచరణ్ హీరోగా వెంగమాంబ క్రియేషనర్స్ బేనర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి లైఫ్ అని టైటిల్ ఫిక్స్ చేశారు. నిర్మాత అంజన్న నిర్మిస్తున్న ఈ సినిమాకి శ్రీను కోటపాటి దర్శకత్వం వహిస్తున్నారు. లైఫ్ సినిమా బుధవారం నాడు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా ప్రారంభమైంది. సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి పూజతో లైఫ్ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ నటుడు సురేష్ క్లాప్ కొట్టగా, నిర్మాత డీఎస్ రావ్ కెమెరా స్విచ్చాన్ చేయగా శివన్నారాయణ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో నిర్మాత అంజన్న మాట్లాడుతూ.…

Read more