Skip to content

కుంభమేళా ఫేమ్ మోనాలిసా ‘లైఫ్’ సినిమా మొదటి షూటింగ్ షెడ్యూల్ పూర్తి

కుంభమేళా ఫేమ్ మోనాలిసా ‘లైఫ్’ సినిమా మొదటి షూటింగ్ షెడ్యూల్ పూర్తి Telugu News

కుంభమేళా ఫేమ్ మోనాలిసా కథానాయికగా నటిస్తున్న చిత్రం లైఫ్. సాయిచరణ్ హీరోగా వెంగమాంబ క్రియేషనర్స్ బేనర్ పై రూపొందుతున్న ఈ సినిమాకి శ్రీను కోటపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అంజన్న నిర్మిస్తున్నారు

ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. త్వరలోనే రెండో షెడ్యూల్ ప్రారంభించనున్నారు మేకర్స్.

ఈ చిత్రంలో సయాజీ షిండే, సీనియర్ నటుడు సురేష్, ఆమని, తులసి, రచ్చ రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. మురళీ మోహన్ రెడ్డి డీవోపీగా పని చేస్తున్నారు. సుకుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. బేబీ సురేష్ ఆర్ట్ డైరెక్టర్.

నటీనటులు: మోనాలిసా భోంస్లే, సాయి చరణ్, సయాజీ షిండే, సీనియర్ నటుడు సురేష్, ఆమని, తులసి, వినయ్, రచ్చ రవి, దేవి, శ్రుతి, రోహిత, సుష్మ, బోస్, బార్బీ

సాంకేతిక నిపుణులు
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: కోటపాటి శ్రీను
నిర్మాత: అంజయ్య విరిగినేని
DOP : మురళీ మోహన్ రెడ్డి
సంగీతం:సుకుమార్
రీ రికార్డింగ్: దినేష్
సాహిత్యం : కాసర్ల, శ్యామ్ JP
డైలాగ్: శ్రీరామ్ ఏదోటి, గుత్తి మల్లికార్జున్, భాస్కర్
స్టంట్ మాస్టర్ : నందు
ఆర్ట్ డైరెక్టర్: బేబీ సురేష్
స్టిల్స్: ఎం. శ్రీను
కాస్ట్యూమర్స్: అప్పారావు, డి. శ్రీనివాసరావు
కాస్ట్యూమ్ డిజైనర్: ప్రవళిక
మేకప్: కమలాకర్
కొరియోగ్రాఫర్లు: స్వర్ణ, కెకె ప్రేమ్
ప్రొడక్షన్ కంట్రోలర్: శర్మ PLM ఖాన్
ప్రొడక్షన్ ఆర్గనైజర్: ఎం. శ్రీనివాసరావు
ప్రొడక్షన్ డిజైనర్: డా. సిహెచ్. రత్నాకర్ రెడ్డి
పీఆర్వో. వంశీ శేఖర్

See also  “ది ట్రైటర్స్” ఓటీటీ రియాలిటీ షో హోస్ట్ గా తేజ సజ్జా

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.