Skip to content

న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల ను నియమించింది. నాట్స్ ఛైర్మన్ కిశోర్ కంచర్ల పాల్గొన్న ప్రత్యేక మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో నాట్స్ అధ్యక్షుడు రాజ్ అల్లాడ ఈ నియామకాన్ని ప్రకటించారు. న్యూజెర్సీకి చెందిన నాట్స్ అధ్యక్షుడు రాజ్ అల్లాడ మాట్లాడుతూ, యువకుడు, ఉత్సాహవంతుడు, చురుకైన నాయకుడైన సాయి గంగులకు సామాజిక సేవ పట్ల ఉన్న అంకితభావం న్యూజెర్సీ వ్యాప్తంగా నాట్స్ కార్యకలాపాలను మరింత బలోపేతం చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువతను నాట్స్ సేవా కార్యక్రమాల్లో మరింతగా భాగస్వాములను చేయడంలో సాయి గంగుల కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు…

Read more