Skip to content

గోపి గాళ్ళ గోవా ట్రిప్ ప్రీ రిలీజ్ ఈవెంట్

తెలుగు ప్రేక్షకులు డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు చూడటానికి ఇష్టపడుతుంటారు. అలానే ఒరిజినాలిటీకి దగ్గరగా ఉన్న సినిమాలకి ఎప్పుడూ బ్రహ్మరథం పడుతుంటారు. అలా వచ్చిన ఎన్నో సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు. ఇక తెలుగులో ఇండిపెండెంట్ ఫిలిం మేకర్స్ రోహిత్ మరియు క్యాంప్ శశి గురించి ప్రత్యేకించి పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. వీళ్లు చేసిన ఎన్నో ఇండిపెండెంట్ ఫిలిమ్స్ కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. చాలామంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ దర్శక నిర్మాతలు కూడా వీళ్ళ వర్క్ చూసి ఫిదా అవుతుంటారు. స్టోరీ డిస్కషన్స్, నిరుద్యోగ నటులు వంటి సిరీస్ వీళ్లకు మంచి పేరు తీసుకొచ్చింది. ఇక ప్రస్తుతం రోహిత్ మరియు శశి దర్శకత్వం వహించిన గోపిగాళ్ల గోవా ట్రిప్. ఈ సినిమా…

Read more

రైట్ కంటెంట్ తీసుకుని కష్టపడి సినిమా చేస్తే తప్పకుండా విజయం దక్కుతుందని “K-ర్యాంప్” ప్రూవ్ చేసింది. – ‘ర్యాంపేజ్ బ్లాక్ బస్టర్ ఈవెంట్’ లో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు

సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన "K-ర్యాంప్" మూవీ హౌస్ ఫుల్ షోస్ తో పెరుగుతున్న కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ విజయం దిశగా పరుగులు తీస్తోంది. ఈ సినిమా రిలీజైన 3 రోజుల్లోనే 17.5 కోట్ల రూపాయల వసూళ్లను అందుకుని బ్రేక్ ఈవెన్ సాధించింది. "K-ర్యాంప్" సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మించారు. జైన్స్ నాని దర్శకత్వం వహించారు. యుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ నేపథ్యంలో "K-ర్యాంప్" ర్యాంపేజ్ బ్లాక్ బస్టర్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు…

Read more

డ్యూడ్ అందరికీ నచ్చుతుంది: ప్రదీప్ రంగనాథన్

లవ్ టుడే, డ్రాగన్‌లతో రెండు వరుస హిట్‌లను అందించిన యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్‌తో దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. 'ప్రేమలు' అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ సరసన మమిత బైజు నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అక్టోబర్ 17న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీరిలీజ్ ఈవెంట్…

Read more

“బేబి” మూవీ టీమ్ ను అభినందించిన కస్తూరి

71వ జాతీయ అవార్డ్స్ లో రెండు పురస్కారాలు గెల్చుకున్న "బేబి" సినిమా టీమ్ ను అభినందించింది నటి కస్తూరి. ఈ రోజు ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో డైరెక్టర్ సాయి రాజేశ్, ఉత్తమ గాయకుడిగా పీవీఎన్ ఎస్ రోహిత్ నేషనల్ అవార్డ్స్ స్వీకరించారు. ఈ సందర్భంగా బేబి టీమ్ ను ప్రశంసిస్తూ సోషల్ మీడియా పోస్ట్ చేసింది నటి కస్తూరి. ఆమె స్పందిస్తూ - బేబి సినిమా ఒక గేమ్ ఛేంజర్. నేను నా టీనేజ్ అబ్బాయి, అమ్మాయితో కలిసి ఈ సినిమా చూశాను. అప్పటి నుంచి కొన్ని వారాలపాటు మా మధ్య బేబి సినిమా గురించి చర్చ జరిగింది. అని ట్వీట్ చేసింది.

Read more

‘కాయిన్’ ఫస్ట్ ఫ్లిప్ విడుదల

వరుస చిత్రాలతో ఆడియెన్స్‌ను ఆకట్టుకునేందుకు ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నిరంతరం పని చేస్తున్నారు. హీరోగా వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌తో శ్రీకాంత్ రాజారత్నం నిర్మాతగా జైరామ్ చిటికెల తెరకెక్కిస్తున్న చిత్రం ‘కాయిన్’. చంద్రహాస్ పుట్టిన రోజు (సెప్టెంబర్ 17) సందర్భంగా ఈ మూవీ గ్లింప్స్, టైటిల్ పోస్టర్‌ను బుధవారం నాడు రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో.. దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ .. ‘‘కాయిన్’ సినిమాతో ఇండస్ట్రీలోకి కొత్త టాలెంట్ రావాలని కోరుకుంటున్నాను. ప్రభాకర్ గారితో నాకు చాలా ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. చంద్రహాస్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ‘కాయిన్’ చుట్టూ ఇంత జరిగిందా? అని కథ చెప్పినప్పుడు షాక్ అయ్యా. ట్రైలర్…

Read more

కంటెంట్ మాత్రమే నిజమైన సూపర్ స్టార్ అని “లిటిల్ హార్ట్స్” ప్రూవ్ చేసింది – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సాయి రాజేశ్

"లిటిల్ హార్ట్స్" సినిమాకు ప్రేక్షకుల ఆదరణతో పాటు ప్రముఖుల ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. తాజాగా దర్శకుడు సాయి రాజేశ్ ఈ సినిమా టీమ్ కు తన అభినందనలు అందించారు. సాయి రాజేశ్ ఇన్ స్టాలో స్పందిస్తూ - '"లిటిల్ హార్ట్స్" సినిమా చూశాను, కంటెంట్ మాత్రమే నిజమైన సూపర్ స్టార్ అని, కంటెంట్ క్రియేట్ చేయగలిగిన వాడే నిజమైన తోపు అని ప్రూవ్ అయ్యింది. కాలం మారింది, మనం కూడా మారకపోతే ఎవరినో నిందిస్తూ బతకాలి, "లిటిల్ హార్ట్స్" బ్యూటిఫుల్ ఫిలిం, ఒక్క 5 నిమిషాలు కూడా మన మొహం మీద చిరునవ్వు పక్కికి పోదు. మార్తాండ్ సాయి, ఆదిత్య హాసన్, సింజిత్, మౌళికి నా ప్రశంసలు. ప్రతి రెండేళ్లకో, మూడేళ్లకో ఎవడో…

Read more

జాతీయ అవార్డ్స్ గెల్చుకున్న “బేబి” మూవీ టీమ్ ను సత్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డ్స్ లో రెండు పురస్కారాలు గెల్చుకున్న "బేబి" సినిమా టీమ్ ను అభినందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ రోజు జుబ్లీహిల్స్ లోని తన నివాసంలో "బేబి" సినిమా నిర్మాత ఎస్ కేఎన్, నిర్మాత, దర్శకుడు సాయి రాజేశ్, సింగర్ పీవీఎన్ఎస్ రోహిత్ ను సీఎం రేవంత్ రెడ్డి శాలువాతో సత్కరించారు. జాతీయ అవార్డ్స్ గెల్చుకున్న స్ఫూర్తితో మరిన్ని మంచి చిత్రాలు చేయాలని ఆయన ఆకాంక్షించారు. భార‌తీయ సినిమా నిర్మాణానికి కేంద్రంగా హైద‌రాబాద్‌ను నిల‌పాల‌ని ముఖ్య‌మంత్రి అన్నారు. సినిమా రంగానికి ప్రోత్సాహాకానికి అవ‌స‌ర‌మైన చేయూత‌ను అందిస్తామ‌ని ఆయన తెలిపారు. తమకు అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిర్మాత ఎస్ కేఎన్, నిర్మాత, దర్శకుడు సాయి రాజేశ్, సింగర్…

Read more

నేషనల్ అవార్డ్ విన్నర్స్ ని సైమా సత్కరించడం అభినందనీయం: నిర్మాత అల్లు అరవింద్

ప్రతిష్ఠాత్మక ‘సైమా’ 2025 (SIIMA సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌) అవార్డ్స్ వేడుక సెప్టెంబరు 5, 6 తేదీల్లో దుబాయ్‌ లో అంగరంగవైభవంగా జరగనుంది. ఈ వేడుకలకు సంబంధించిన ప్రెస్ మీట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా నేషనల్ అవార్డ్ విజేతలైన దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి(భగవంత్ కేసరి), దర్శకుడు సాయి రాజేష్, సింగర్ రోహిత్ (బేబీ) దర్శకుడు ప్రశాంత్ వర్మ, విజువల్ ఎఫెక్ట్స్ వెంకట్ (హనుమాన్)లని సైమా ఘనంగా సత్కరించింది ప్రెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. విష్ణు, బృందాకి కంగ్రాజులేషన్స్ .12 ఏళ్లుగా ఈ వేడుకని విజయవంతంగా నిర్వహిస్తూ ఇప్పుడు 13వ ఎడిషన్ కి శ్రీకారం…

Read more

నేషనల్ అవార్డ్స్ ఇచ్చిన గౌరవంతో మరింత బాధ్యతగా మంచి సినిమాలు చేస్తాం – “బేబి” మూవీ టీమ్

ప్రతిష్టాత్మక 71 జాతీయ అవార్డ్స్ లో "బేబి" సినిమా రెండు నేషనల్ అవార్డ్స్ గెల్చుకుంది. ఈ చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ గా సాయి రాజేశ్, ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ గా పీవీఎన్ ఎస్ రోహిత్(ప్రేమిస్తున్నా పాటకు) అవార్డ్ గెల్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు హైదరాబాద్ లో "బేబి" మూవీ టీమ్ పాత్రికేయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొని జాతీయ అవార్డ్స్ పొందిన సంతోషాన్ని షేర్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎడిటర్ విప్లవ్ మాట్లాడుతూ - "బేబి" సినిమాకు రెండు నేషనల్ అవార్డ్స్ రావడం సంతోషంగా ఉంది. సాయి రాజేశ్ గారికి వరుసగా రెండోసారి జాతీయ పురస్కారం వచ్చింది. రోహిత్, సాయి రాజేశ్ గారికి కంగ్రాట్స్…

Read more

జాతీయ అవార్డ్స్ లో సత్తాచాటిన “బేబి” మూవీ. ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్, ప్లే బ్యాక్ సింగర్ కేటగిరీల్లో అవార్డ్స్ సొంతం చేసుకున్న కల్ట్ బ్లాక్ బస్టర్

నేడు ప్రకటించిన 71వ జాతీయ అవార్డ్స్ లో "బేబి" సినిమా సత్తాచాటింది. ఈ చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ గా సాయి రాజేశ్, ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ గా పీవీఎన్ ఎస్ రోహిత్(ప్రేమిస్తున్నా పాటకు) అవార్డ్ గెల్చుకున్నారు. "బేబి" సినిమాకు సాయి రాజేశ్ రాసిన హృద్యమైన కథనం జాతీయ స్థాయిలో పురస్కారం సాధించింది. అలాగే ఈ చిత్రంలో ప్రేమిస్తున్నా అనే పాటను మనసుకు హత్తుకునేలా పాడిన సింగర్ పీవీఎన్ ఎస్ రోహిత్ ప్రతిభను నేషనల్ అవార్డ్ వరించింది. "బేబి" సినిమాకు సైమా, గామా, ఫిలింఫేర్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డ్స్ దక్కగా...ఈ రోజు ప్రకటించిన రెండు జాతీయ అవార్డ్స్ అత్యున్నత గౌరవాన్ని అందించాయి. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి…

Read more