సీజన్ 4తో వచ్చేసిన ఆహా వారి తెలుగు ఇండియన్ ఐడల్
తెలుగులో అతి పెద్ద సింగింగ్ షో ఆహా వారి తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 ప్రారంభమయ్యింది. గత మూడు సీజన్లగా సరికొత్త టాలెంట్ ను సంగీత ప్రియులకు, ప్రేక్షకులకు పరిచయం చేస్తు వస్తున్న ఈ టాలెంటెడ్ సింగింగ్ షో మరోసారి గల్లీ వాయిస్ ని గ్లోబల్ లెవెల్లో వినిపించడానికి సిద్ధమైంది. ప్రముఖ సంగీత దర్శకులు తమన్, గాయకులు కార్తీక్ మరియు గీతా మాధురి జడ్జెస్ గా అలాగే శ్రీరామచంద్ర హోస్ట్ గా గత మూడు సీజన్లు ప్రేక్షకులకు వినోదాన్ని పంచాయి. తాజాగా వస్తున్న సీజన్ 4 లో మోర్ ఫన్ ఇచ్చేందుకు ప్రముఖ గాయని సమీరా భరద్వాజ్ ను శ్రీరామ్ చంద్రకు కో హోస్ట్ గా తీసుకొచ్చారు. షోకు సంబంధించి టాలెంట్…
