Skip to content

సీజన్ 4తో వచ్చేసిన ఆహా వారి తెలుగు ఇండియన్ ఐడల్

సీజన్ 4తో వచ్చేసిన ఆహా వారి తెలుగు ఇండియన్ ఐడల్ Telugu News

తెలుగులో అతి పెద్ద సింగింగ్ షో ఆహా వారి తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 ప్రారంభమయ్యింది. గత మూడు సీజన్లగా సరికొత్త టాలెంట్ ను సంగీత ప్రియులకు, ప్రేక్షకులకు పరిచయం చేస్తు వస్తున్న ఈ టాలెంటెడ్ సింగింగ్ షో మరోసారి గల్లీ వాయిస్ ని గ్లోబల్ లెవెల్లో వినిపించడానికి సిద్ధమైంది. ప్రముఖ సంగీత దర్శకులు తమన్, గాయకులు కార్తీక్ మరియు గీతా మాధురి జడ్జెస్ గా అలాగే శ్రీరామచంద్ర హోస్ట్ గా గత మూడు సీజన్లు ప్రేక్షకులకు వినోదాన్ని పంచాయి. తాజాగా వస్తున్న సీజన్ 4 లో మోర్ ఫన్ ఇచ్చేందుకు ప్రముఖ గాయని సమీరా భరద్వాజ్ ను శ్రీరామ్ చంద్రకు కో హోస్ట్ గా తీసుకొచ్చారు. షోకు సంబంధించి టాలెంట్ హంట్ లో భాగంగా అమెరికా తో రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిపిన ఆడిషన్స్ లో ఎందరో ఔత్సాహిక గాయకులను ఎంపిక చేశారు. తదపరి దశలో వారందరిలో నుంచి టాప్ 12 కంటెస్టెంట్స్ ను నిర్ణయిస్తారు. మొట్లమొదటి లాంఛ్ ఎపిసోడ్ గా ఈ అడిషన్స్ కార్యక్రమం ప్రసారం అవుతుంది. తెలుగు ఇండియన్ ఐడల్ పోటీలో పాల్గొన్న ప్రతీ కంటెస్టెంట్ కు సినీరంగంలో అద్భుత అవకాశాలు లభిస్తున్నాయి. మొదటి సీజన్ విన్నర్ వాగ్దేవి మరియు సాయి సౌజన్య స్టార్ సినిమాల్లో పాటలు పాడుతున్నారు. గత సీజన్ విన్నర్ నజీర్ త్వరలో రాబోతున్న ప్రముఖ చిత్రం ఓజీలో పాటకు తన గాత్రాన్ని అందించాడు. ప్రేక్షుకులకు వినోదాన్ని పంచుతూనే ప్రతిభ ప్రోత్సహించేందుకు ఈ తరహా రియాలటీ షోలను అందిస్తున్నట్టు ఆహా యాజమాన్యం తెలిపింది.

Vishwanath

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.