జూన్ 12న గ్రాండ్‌గా “ది నైట్ ఆఫ్ ది స్టార్స్” మ్యూజికల్ ఈవెంట్
సీన్ సెటర్స్, అసెంబ్లీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక సంగీత వేడుక "ది నైట్ ఆఫ్ ది స్టార్స్" జూన్ 12, 2026న హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అసెంబ్లీలో జరగనుంది. ప్రముఖ సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్, ప్రముఖ నేపథ్య గాయని గీతా మాధురి, అలాగే సాకేత్, వినూత్న, కశ్యప్, అదితి , భార్గవి తమ అద్భుతమైన సంగీత ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించనున్నారు. ప్రముఖ యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహ ఈ వేడుకని ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో నిఖిల్ విజయేంద్ర సింహ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. మనందరం చిన్నప్పటి నుంచి పాటలను మధురమైన జ్ఞాపకాలుగా, నోస్టాల్జిక్ ఫీలింగ్స్‌గా ఆస్వాదిస్తూ పెరిగాం…
