సంతాన ప్రాప్తిరస్తు నుంచి ‘తెలుసా నీకోసమే..’ సాంగ్ లాం చ్
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా "సంతాన ప్రాప్తిరస్తు". ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా నవంబర్ 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా నుంచి తెలుసా నీ కోసమే లిరికల్ సాంగ్ ను ప్రొడ్యూసర్ సురేష్ బాబు అతిథిగా రిలీజ్ చేశారు. "ఆయ్", "సేవ్ ది టైగర్స్" వంటి సక్సెస్ ఫుల్ ప్రాజెక్ట్స్ కు…
