Skip to content

పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్రమాల్లో అమ‌రావ‌తికి ఆహ్వానం

ప్ర‌జెంట్ ట్రెండ్‌లో హార‌ర్ సినిమాలు హ‌వా న‌డుస్తోంది. ఈ ఏడాది విడుద‌లైన అన్నీ హార‌ర్ సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యం సాధించాయి. ప్ర‌స్తుతం అదే త‌ర‌హాలో ఉత్కంఠ‌భ‌రిత‌మైన‌ క‌థ, క‌థ‌నంతో ప్రేక్ష‌కుల‌కి సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌ అనుభూతినిచ్చే విధంగా రూపొందిన చిత్రం అమ‌రావ‌తికి ఆహ్వానం. ఈ సినిమా టైటిల్ కి ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల్లో మంచి ఆధ‌రణ ల‌భించింది. శివ కంఠంనేని,ధ‌న్య బాల‌కృష్ణ‌, ఎస్త‌ర్, సుప్రిత, హ‌రీష్ ప్ర‌ధాన పాత్ర‌ల‌తో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో సీనియ‌ర్ న‌టులు అశోక్ కుమార్‌, భ‌ద్ర‌మ్‌, జెమిని సురేష్, నాగేంద్ర ప్రసాద్ కీల‌క‌పాత్ర‌లు పోషించారు. డైరెక్ట‌ర్ జివికె ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత ముప్పా వెంక‌య్య చౌద‌రి గారి నిర్మాణ సార‌థ్యంలో జి. రాంబాబు యాద‌వ్…

Read more

‘ది రైజ్ ఆఫ్ అశోక’ నుంచి ‘వినరా మాదేవ’ పాట విడుదల

‘లూసియా’ ఫేమ్ సతీష్ నినాసం హీరోగా, నిర్మాతగా భారీ ఎత్తున రూపొందిస్తున్న చిత్రం ‘ది రైజ్ ఆఫ్ అశోక’. ఈ మూవీని వృద్ధి క్రియేషన్, సతీష్ పిక్చర్ హౌస్ బ్యానర్ల మీద వర్ధన్ హరి, జైష్ణవి, సతీష్ నినాసం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు వినోద్ వి ధోండలే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సతీష్ నినాసంకి జోడిగా ‘కాంతార’, ‘తమ్ముడు’ ఫేమ్ సప్తమి గౌడ నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ‘ది రైజ్ ఆఫ్ అశోక’ నుంచి ‘వినరా మాదేవ’ అంటూ సాగే జాతర పాటను రిలీజ్ చేశారు. ఈ పాటలోని సాహిత్యం వింటే శివుడి గొప్పదనం మరోసారి అందరికీ అర్థమవుతుంది. ఆ…

Read more