Skip to content

‘ది రైజ్ ఆఫ్ అశోక’ నుంచి ‘వినరా మాదేవ’ పాట విడుదల

‘ది రైజ్ ఆఫ్ అశోక’ నుంచి ‘వినరా మాదేవ’ పాట విడుదల Telugu News

‘లూసియా’ ఫేమ్ సతీష్ నినాసం హీరోగా, నిర్మాతగా భారీ ఎత్తున రూపొందిస్తున్న చిత్రం ‘ది రైజ్ ఆఫ్ అశోక’. ఈ మూవీని వృద్ధి క్రియేషన్, సతీష్ పిక్చర్ హౌస్ బ్యానర్ల మీద వర్ధన్ హరి, జైష్ణవి, సతీష్ నినాసం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు వినోద్ వి ధోండలే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సతీష్ నినాసంకి జోడిగా ‘కాంతార’, ‘తమ్ముడు’ ఫేమ్ సప్తమి గౌడ నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు.

‘ది రైజ్ ఆఫ్ అశోక’ నుంచి ‘వినరా మాదేవ’ అంటూ సాగే జాతర పాటను రిలీజ్ చేశారు. ఈ పాటలోని సాహిత్యం వింటే శివుడి గొప్పదనం మరోసారి అందరికీ అర్థమవుతుంది. ఆ ఊరి ప్రజలు శివుడ్ని ఎంతగా ఆరాధిస్తారు? ఎలా పూజిస్తారు? అనేది ఈ పాటలో, అందులోని సాహిత్యంలో చక్కగా చూపించారు. ఊరంతా కలిసి జరుపుకునే జాతర నేపథ్యంలో వచ్చే ఈ పాటలో విజువల్స్ అదిరిపోయాయి. ఈ పాటకు శ్రీనివాస్ కాళే అందించిన సాహిత్యం ఒకెత్తు అయితే.. సంతు మాస్టర్ కొరియోగ్రఫీ మరో ఎత్తు.

‘వినరా మాదేవ’ అనే పాటను సతీష్ నినాసం, సాద్విని కొప్ప, సిద్దు కలిసి సంయుక్తంగా ఆలపించారు. ఈ పాటలో సప్తమి గౌడ లుక్స్, అప్పియరెన్స్, స్టెప్పులు కూడా హైలెట్ కానున్నాయి. ఇక ఈ పాటను వింటే మాత్రం గూస్ బంప్స్ పక్కా అనేలా విజువల్స్, గ్రాండియర్ సెట్స్ కనిపిస్తున్నాయి. లహరి మ్యూజిక్ ద్వారా ఆడియో మార్కెట్లోకి విడుదలైంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అన్ని పనుల్ని పూర్తి చేసుకుని ఆడియెన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

తారాగణం : సతీష్ నినాసం, సప్తమి గౌడ, బి.సురేష్, సంపత్, మైత్రేయ, గోపాల్ కృష్ణ దేశపాండే, యష్ శెట్టి, జగప్ప, రవిశంకర్ (ఆర్ముగ), డ్రాగన్ మంజు తదితరులు

సాంకేతిక బృందం
బ్యానర్: వృద్ధి క్రియేషన్, సతీష్ పిక్చర్ హౌస్
నిర్మాతలు : వర్ధన్ హరి – జైష్ణవి – సతీష్ నినాసం
దర్శకుడు : వినోద్ వి ధోండలే
డీఓపీ : లవిత్
సంగీత దర్శకుడు : పూర్ణచంద్ర తేజస్వి
ఆర్ట్ డైరెక్టర్ : హోస్మనే మూర్తి, జనార్దన్ కుక్కే
ఎడిటర్ : మను షెడ్గర్
పీఆర్వో : సాయి సతీష్

See also  పరదా' ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంది : నిర్మాత విజయ్ డొంకాడ

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.