Skip to content

తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ ఫస్ట్ సింగిల్ ఈ నెల 29న రిలీజ్

తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ ఫస్ట్ సింగిల్ ఈ నెల 29న రిలీజ్ Telugu News

ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవాలని ఆశపడే ఔత్సాహిక నటీనటుల, సాంకేతిక నిపుణులకు అండగా నిలబడుతూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా “తిమ్మరాజుపల్లి టీవీ”. తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. “తిమ్మరాజుపల్లి టీవీ” చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

తాజాగా ఈ చిత్ర మ్యూజిక్ ప్రమోషన్స్ బిగిన్ చేశారు. “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమా ఫస్ట్ సింగిల్ ను ఈ నెల 29న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మ్యూజిక్ డైరెక్టర్ వంశీకాంత్ రేఖన ఈ సినిమా కోసం ఛాట్ బస్టర్ సాంగ్స్ చేశారు. తమ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ వస్తుందంటూ కిరణ్ అబ్బవరం అనౌన్స్ చేసిన వీడియో ప్రోమో ఆకట్టుకుంటోంది.

నటీనటులు – సాయి తేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్, సత్యనారాయణ, లతీష్, తదితరులు

టెక్నికల్ టీమ్
———————————–

ఆర్ట్ డైరెక్టర్ – సుధీర్ మాచర్ల
బిజినెస్ హెడ్ అండ్ మార్కెటింగ్ – చౌహాన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – రితికేష్ గోరక్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – కేఎల్ మదన్
డీవోపీ – అక్షయ్ రామ్ పొదిశెట్టి
మ్యూజిక్ – వంశీకాంత్ రేఖన
సీఈవో – రహస్య కిరణ్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
కో ప్రొడ్యూసర్ – తేజ వేల్పుచర్ల
ప్రొడ్యూసర్ – కిరణ్ అబ్బవరం
రచన, ఎడిటింగ్, దర్శకత్వం – వి. మునిరాజు

See also  'గాయపడ్డ సింహం'- టీజర్ ఫిబ్రవరి 9న రిలీజ్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.