2025 ఏడాదిలో మరింత వినోదాన్ని, అనుభూతిని ఇచ్చేందుకు అద్భుతమైన కంటెంట్‌లతో రెడీగా ఉన్న ‘సోనీ లివ్’
2025లో సోనీ లివ్ ఒరిజినల్స్, బ్లాక్‌బస్టర్ అన్‌స్క్రిప్ట్డ్ షోలు, అతిపెద్ద క్రీడా కార్యక్రమాలతో అందరినీ అలరించేందుకు సిద్ధంగా ఉంది. ఉత్తేజకరమైన రాజకీయ నాటకాలు, అడ్రినల్ రష్ కలిగించే థ్రిల్లర్లు, హృదయాన్ని హత్తుకునేలా కుటుంబ గాథలు ఇలా ప్రతీ ఒక్క ప్రేక్షకుడిని కట్టి పడిసేందుకు రకరకాల ప్రాజెక్టులతో సోనీ లివ్ రెడీగా ఉంది. ఇక క్రీడల విషయానికి వస్తే సోనీ లివ్ ప్రపంచంలోని గొప్ప టోర్నమెంట్‌లను నేరుగా మీ తెరపైకి తీసుకురానుంది. హిందీలో రాబోతోన్న సిరీస్‌లు ఇవే.. • రియల్ కాశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్ అనే ఓ సిరీస్ రాబోతోంది. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. జయ ఎంటర్‌టైన్‌మెంట్, ఓషున్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సిరీస్‌ను నిర్మించారు. షోరన్నర్‌గా మహేష్ మతాయ్ వ్యవహరించారు…
