Skip to content

‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేడుక గీతం ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ విడుదల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని అభిమానించే వారు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉన్నారు. ఆయన తెరపై కనిపించడమే అభిమానులకు ఓ వేడుక. ఇక పవన్ కళ్యాణ్‌ మేనరిజమ్స్‌ కి ఉండే క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నో సంవత్సరాలుగా, లక్షలాది మంది పవన్ కళ్యాణ్ యొక్క ఐకానిక్ మేనరిజమ్‌లను అనుకరించారు. ఆ అప్రయత్నమైన స్వాగర్‌ను, ఆ ఉత్తేజకరమైన బాడీ లాంగ్వేజ్‌ను, ఆ ప్రత్యేకమైన అటిట్యూడ్‌ను తిరిగి సృష్టించడానికి చాలామంది ప్రయత్నించారు. కానీ, ఇప్పటి వరకు ఎవరూ దానికి అసలైన నిర్వచనం ఇవ్వలేకపోయారు. ఇప్పుడు “ఆరా ఆఫ్ ఉస్తాద్”తో ఆ నిర్వచనం శాశ్వతంగా చెక్కబడింది. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా కల్ట్ కెప్టెన్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్…

Read more

‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 26న విడుదల

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా కల్ట్ కెప్టెన్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. తెలుగు సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ప్రత్యేక విందుగా నిలవడంతో పాటు, అన్ని వయసుల ప్రేక్షకులను అలరించేలా వినోదభరితంగా ఈ చిత్రాన్ని మలుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన తొలి గీతం ‘దేఖ్‌లేంగే సాలా’లో పవన్ కళ్యాణ్ కనిపించిన తీరు కట్టిపడేసింది. లుక్, ఎనర్జీ, స్టెప్పులు పరంగా వింటేజ్ పవర్‌స్టార్ ను…

Read more

శరవేగంగా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’

శుభ ముహూర్తంలో డబ్బింగ్ పనులు ప్రారంభం డబ్బింగ్ కార్యక్రమాలలో పాల్గొననున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం కీలకమైన పోస్ట్‌ ప్రొడక్షన్ దశలోకి ప్రవేశించింది. శుభ ముహూర్తంలో డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయి. తన శక్తివంతమైన రచన, మాస్‌ మెచ్చే సంభాషణలకు పేరుగాంచిన హరీష్ శంకర్ ను అభిమానులు ముద్దుగా 'కల్ట్ కెప్టెన్' అని పిలుస్తారు. ఆ పేరుకి తగ్గట్టుగానే 'ఉస్తాద్ భగత్ సింగ్'ను కల్ట్ చిత్రంగా మలచడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను దర్శకుడు హరీష్ శంకర్ వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. సినిమా అనుభూతిని మరో స్థాయికి తీసుకెళ్లేలా.. ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించే, ప్రేక్షకుల చేత ఈలలు వేయించే…

Read more

మే 1న ‘లెనిన్’ విడుద‌ల

అఖిల్ అక్కినేని హీరోగా మనం ఎంట‌ర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై ముర‌ళి కిషోర్ అబ్బూరు ద‌ర్శ‌క‌త్వంలో అక్కినేని నాగార్జున‌, సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తోన్న చిత్రం ‘లెనిన్’. ఈ సినిమాను సోమ‌వారం రోజున ‘వారెవా వారెవా..’ అనే లిరిక‌ల్ సాంగ్‌ను విడుద‌ల చేవారు. ఈ పాట‌కు అభిమానులు, మ్యూజిక్ ల‌వ‌ర్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ పాట‌ను అనంత శ్రీరామ్ రాయ‌గా.. శ్వేతా మోహ‌న్‌, జుబిన్ నౌటియాల్ త‌మ వాయిస్‌తో పాట‌కు ఓ ఎమోష‌న‌ల్ ఫీల్‌ను తీసుకొచ్చారు. మ్యూజికల్ సెన్సేష‌న‌ల్ ఎస్‌.ఎస్‌.త‌మన్ సంగీతం సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ చిత్రంలోని ఈ పాట‌ రొమాంటిక్ ఫీల్‌ను క‌లిగిస్తోంది. సినిమాలోని భావోద్వేగాలను చక్కగా ప్రతిబింబిస్తూ, హీరో–హీరోయిన్ మధ్య కెమిస్ట్రీని హైలైట్ చేసేలా పాట…

Read more

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు ప్రాణం పెట్టి పనిచేశారు: దర్శకుడు హరీష్ శంకర్

ఘనంగా 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలి గీతం ‘దేఖ్‌లేంగే సాలా’ ఆవిష్కరణ వేడుక 'గబ్బర్ సింగ్' వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో రూపొందుతోన్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి తొలి గీతంగా ‘దేఖ్‌లేంగే సాలా’ విడుదలైంది. ఈ గీతావిష్కరణ కార్యక్రమం శనివారం సాయంత్రం రాజమండ్రిలో జరిగింది. అభిమానుల కోలాహలం నడుమ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో దర్శకుడు హరీష్ శంకర్, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, నిర్మాత నవీన్ యెర్నేని, గీత రచయిత భాస్కరభట్ల తదితరులు పాల్గొన్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్'…

Read more

మాస్ అంశాలతో కూడిన వినూత్న చిత్రం ‘మాస్ జాతర’ : దర్శకుడు భాను భోగవరపు

మాస్ మహారాజా రవితేజ 75వ చిత్రం 'మాస్ జాతర'. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రవితేజ, శ్రీలీల, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. అక్టోబర్ 31వ తేదీ సాయంత్రం ప్రత్యేక ప్రదర్శనలతో థియేటర్లలో అడుగుపెట్టనున్న 'మాస్ జాతర' చిత్రం కోసం మాస్ మహారాజా అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పు పొంది.. భారీ అంచనాలు…

Read more

ఘనంగా ‘మాస్ జాతర’ ప్రీ రిలీజ్ వేడుక

మాస్ మహారాజా రవితేజ అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'మాస్ జాతర'. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రవితేజ, శ్రీలీల, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. అక్టోబర్ 31వ తేదీ సాయంత్రం ప్రత్యేక ప్రదర్శనలతో థియేటర్లలో అడుగుపెట్టనున్న 'మాస్ జాతర' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ…

Read more

రవితేజ ‘మాస్ జతర’ ట్రైలర్ విడుదల

మాస్ మహారాజా రవితేజ అభిమానులతో పాటు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'మాస్ జతర' సినిమా ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. రవితేజ నుండి అభిమానులు, ప్రేక్షకులు ఆశించే అసలుసిసలైన మాస్ వేడుకలా ఈ ట్రైలర్ ఉంది. రైల్వే పోలీస్ అధికారిగా రవితేజ తనదైన శైలిలో ఒదిగిపోయిన తీరు కట్టిపడేసింది. రవితేజ అంటేనే ఉత్సాహంతో తెర వెలిగిపోతుంది. ఆ ఉత్సాహం 'మాస్ జతర' ట్రైలర్ లో అడుగడుగునా కనిపించింది. భారీ యాక్షన్ సన్నివేశాలు, అదిరిపోయే పంచ్ డైలాగ్‌లతో మాస్ మహారాజా అభిమానులు కోరుకునే మాస్ విందులా ఈ ట్రైలర్ ను మలిచారు. కథానాయకుడు, ప్రతినాయకుడు మధ్య ఉత్కంఠభరితమైన సంఘర్షణ నేపథ్యంలో ట్రైలర్ ను రూపొందిన తీరు ఆకట్టుకుంది. వాణిజ్య అంశాలతో నిండిన పూర్తి స్థాయి…

Read more

‘మాస్ జాతర’ చిత్రం నుండి మాస్ గీతం ‘సూపర్ డూపర్‌’ విడుదల

'మాస్ జాతర' చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన 'తు మేరా లవర్', 'ఓలే ఓలే', 'హుడియో హుడియో' గీతాలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకొని, సామాజిక మాధ్యమాల్లో ఉర్రూతలూగించాయి. తాజాగా చిత్ర బృందం, నాలుగో గీతంగా ఉత్సాహభరితమైన మాస్ పాట 'సూపర్ డూపర్‌'ను విడుదల చేసింది. రవితేజ మాస్ కి, శ్రీలీల ఎనర్జీకి తగ్గట్టుగా స్వరపరిచిన ఈ బ్లాక్ బస్టర్ ట్యూన్ అందరినీ కట్టిపడేస్తోంది. 'మాస్ జాతర' చిత్రాన్ని, ఆల్బమ్ ని మరింతగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేలా ఈ 'సూపర్ డూపర్‌' గీతముంది. రెండు ఉత్సాహభరితమైన పాటలు, ఓ మంచి మెలోడీతో ఇప్పటికే 'మాస్ జాతర' ఆల్బమ్ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తాజాగా విడుదలైన మాస్ ని ఉర్రూతలూగించే ఈ 'సూపర్ డూపర్‌'…

Read more

మాస్ జాతర’ చిత్రం నుండి ‘హుడియో హుడియో’ విడుదల

'మాస్ జాతర' చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన 'తు మేరా లవర్', 'ఓలే ఓలే' గీతాలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకొని, సామాజిక మాధ్యమాల్లో ఉర్రూతలూగించాయి. తాజాగా చిత్ర బృందం, మూడవ గీతంగా 'హుడియో హుడియో' అనే సరికొత్త మెలోడీని ప్రేక్షకులకు అందించింది. మాస్ మరియు మెలోడీని అందంగా మిళితం చేసిన ఈ మనోహరమైన ట్యూన్, అందరినీ కట్టిపడేస్తోంది. ఈ గీతం సినిమా మరియు ఆల్బమ్ రెండింటికీ సరైన భావోద్వేగ లయను తాకుతుంది. రెండు ఉత్సాహభరితమైన పాటలతో అందరినీ కాలు కదిపేలా చేసిన తర్వాత, ఇప్పుడు శ్రోతల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకునే ఓ మంచి మెలోడీతో వచ్చారు. మునుపటి మాస్ మహారాజా రవితేజను తిరిగి తీసుకొని వస్తున్నట్టుగా మాస్-క్లాస్ కలిసిన ఆరా ఇందులో…

Read more