Skip to content

‘విష్ణు విన్యాసం’ 27న రిలీజ్

‘విష్ణు విన్యాసం’  27న  రిలీజ్ Telugu News

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు హిలేరియస్ జాయ్‌రైడ్‌ ‘విష్ణు విన్యాసం’తో అలరించబోతున్నారు. ఈ సినిమా ప్రతి అప్‌డేట్‌తో బజ్ పెంచుతోంది. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన నయన సారిక హీరోయిన్ గా నటిస్తోంది.

‘విష్ణు విన్యాసం’ చుట్టూ ఉన్న బజ్ ఇప్పుడు మరింత ఎగ్జైటింగ్‌గా మారింది. పెరుగుతున్న అంచనాలకు అనుగుణంగా మేకర్స్ ఈ సినిమాను ముందుగా ప్లాన్ చేసిన ఫిబ్రవరి 28 కంటే ఒక రోజు ముందే, ఫిబ్రవరి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ పోస్టర్‌లో శ్రీ విష్ణు పాత తేదీని క్రాస్ చేస్తూ కనిపించడం అలరించింది. అతని వెనుక నయన సారిక తన చిరునవ్వుతో నిలబడి ఉండటం పోస్టర్‌కు మరింత చార్మ్‌ను జోడించింది.

ఇప్పటికే ‘విష్ణు విన్యాసం’ ప్రమోషనల్ కంటెంట్ మంచి ఇంపాక్ట్‌ను క్రియేట్ చేసింది. మొదటి రెండు పాటలు అద్భుతమైన స్పందనను పొందగా, టీజర్ విడుదల తర్వాత అంచనాలు మరింత పెరిగాయి. కంప్లీట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ టీజర్ లో జాతకాల పిచ్చి వున్న ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ లో శ్రీ విష్ణు అలరించగా, కథలో నయన సారిక పాత్ర కూడా కీలకంగా ఉండబోతుందని స్పష్టంగా చూపించారు.

ఈ చిత్రంలో సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, రధన్ సంగీతం అందిస్తున్నారు. ఎ రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్, కార్తికేయన్ రోహిణి ఎడిటర్.

యూనిక్ క్యారెక్టర్స్, ఆకట్టుకునే ప్రేమకథ, హిలేరియస్ ఫన్ తో విష్ణు విన్యాసం ఒక రిఫ్రెషింగ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది.

తారాగణం: శ్రీ విష్ణు, నయన సారిక, సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: యదునాథ్ మారుతీ రావు
ప్రొడక్షన్ హౌస్: శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్
నిర్మాత: సుమంత్ నాయుడు జి
సమర్పణ: హేమ & షాలిని
సహ నిర్మాతలు: సుబ్రమణ్యం నాయుడు జి, రామాచారి ఎం
DOP: సాయి శ్రీరామ్
సంగీతం: రధన్
ఆర్ట్ డైరెక్టర్: ఎ. రామాంజనేయులు
లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి
కొరియోగ్రఫీ: భాను మాస్టర్
పబ్లిసిటీ డిజైనర్: అనంత్ కంచెర్ల
PRO: వంశీ-శేఖర్

See also  లిటిల్ హార్ట్స్ చూస్తుంటే మీ కాలేజ్ డేస్ గుర్తొస్తాయి - శివానీ నాగరం

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.