భారతీయ సినిమాలో కొత్త అధ్యాయాన్ని లిఖించిన ‘కొత్త లోక’
ప్రముఖ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ కి చెందిన వేఫేరర్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన 'కొత్త లోక 1: చంద్ర' చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటోంది. వేఫేరర్ పతాకంపై నిర్మించిన ఏడవ చిత్రం ఇది. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించబడిన ఈ మలయాళ చిత్రం కేరళ సరిహద్దులను దాటి విస్తృత ప్రశంసలు అందుకుంటోంది. చిత్రానికి మాత్రమే కాకుండా దుల్కర్ సల్మాన్ మరియు వేఫేరర్ ఫిలిమ్స్ వారి దార్శనికతకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. మలయాళ సినిమాలో ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా అత్యంత భారీస్థాయిలో, భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రాన్ని, ఇంత సాంకేతిక పరిపూర్ణతతో నిర్మించడం ద్వారా దుల్కర్ సల్మాన్ అసాధారణమైన అడుగు ముందుకు వేశారు. దీనిని ఓ మలయాళ…
