ఘనంగా దిగ్ధర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా “వేదవ్యాస్” హీరో పిడుగు విశ్వనాథ్
తెలుగు చిత్ర పరిశ్రమలో హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తో ఎన్నో ఘన విజయాలను అందించిన దిగ్ధర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా "వేదవ్యాస్". ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కె.అచ్చిరెడ్డి సమర్పణలో సాయిప్రగతి ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త, పొలిటీషియన్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో సౌత్ కొరియా నటి జున్ హ్యున్ జీ హీరోయిన్ గా నటిస్తుండటం విశేషం. బుధవారం నిర్మాత కె.అచ్చిరెడ్డి బర్త్ డే పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం ఆయన పుట్టినరోజు వేడుకలతో పాటు "వేదవ్యాస్" హీరో పిడుగు విశ్వనాథ్ ను పరిచయం చేశారు. హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో నటుడు సాయికుమార్ అతిథిగా పాల్గొన్నారు. ఈ…
