మహావతార్ నరసింహ రిలీజ్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను: నిర్మాత అల్లు అరవింద్
హోంబాలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మహావతార్ నరసింహ. ఈ చిత్రానికి అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్ చైతన్య దేశాయ్ నిర్మించారు. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా జూలై 25న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని అందుకొని, భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసి, సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. సక్సెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. ఈ సినిమాని నేను రిలీజ్ చేసేలా…
