ఘనంగా ఘంటసాల ది గ్రేట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఇది మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు
టాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుడు, తన విలక్షణమైన బాణీలతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఘంటసాల వేంకటేశ్వరరావు (ఘంటసాల) బయోపిక్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కింది. సి.హెచ్. రామారావు దర్శకత్వంలో ‘ఘంటసాల ది గ్రేట్’ అనే టైటిల్‌తో డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో ఘంటసాల జీవితాన్ని ఆధారంగా చేసుకుని, ఆయన లైఫ్ లోని విభిన్న ఘట్టాలను కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నారు. అన్యుక్త్ రామ్ పిక్చర్స్ సమర్పణలో శ్రీమతి సి.హెచ్. ఫణి నిర్మాణ సారథ్యంలో సి.హెచ్. రామారావు రచన, దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాలో కృష్ణ చైతన్య ఘంటసాలగా, మృదుల ఘంటసాల సావిత్రమ్మగా, చిన్న ఘంటసాలగా తులసి మూవీ ఫేమ్ అతులిత నటించగా.. సుమన్ ముఖ్య…
