Skip to content

ఉన్నట్ట మరి లేనట్ట’ సాంగ్ రిలీజ్ చేసిన హీరో శ్రీకాంత్

ఉన్నట్ట మరి లేనట్ట’ సాంగ్ రిలీజ్ చేసిన హీరో శ్రీకాంత్ Telugu News

త్రినాధ్ కఠారి హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత బళ్లారి శంకర్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ ఇట్లు మీ ఎదవ. తెలుగు అమ్మాయి సాహితీ అవాంచ హీరోయిన్ గా నటిస్తున్నారు. వెయేళ్ళు ధర్మంగా వర్ధిల్లు అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఆర్పీ పట్నాయక్ ఈ సాంగ్ ని అద్భుతమైన మెలోడీగా కంపోజ్ చేశారు. పూర్ణాచారి ఆకట్టుకునే లిరిక్స్ రాశారు. S P చరణ్, శృతిక సముద్రాల వోకల్స్ మెస్మరైజ్ చేశాయి. సాంగ్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఇట్లు మీ ఎదవ టైటిల్ చాలా కొత్తగా వుంది. ఉన్నట్ట మరి లేనట్ట సాంగ్ చాలా అద్భుతంగా వుంది. ఆర్పీ పట్నాయక్ గారు ఎక్స్ట్రార్డినరీగా కంపోజ్ చేశారు. త్రినాధ్, సాహితీ జోడి చాలా బావుంది. ప్రొడ్యూసర్ శంకర్, డిఓపి జగదీష్ నాకు మంచి మిత్రులు. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తూ ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను అని చెప్పారు.

ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవీ ప్రసాద్, సురభి ప్రభావతి, మధుమణి, తాగుబోతు రమేష్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు R P పట్నాయక్ మ్యూజిక్ అందించడం విశేషం. జగదీష్ చీకటి డీవోపీగా పని చేస్తున్న ఈ చిత్రానికి ఉద్ధవ్ SB ఎడిటర్.

ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

తారాగణం: త్రినాధ్ కఠారి, సాహితీ అవాంచ, తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవీ ప్రసాద్, నవీన్ నేని, సురభి ప్రభావతి, మధుమణి, తాగుబోతు రమేష్, చలాకీ చంటి, జబర్దస్త్ నూకరాజు, జెమినీ సురేష్, డీడీ శ్రీనివాస్, రామజగన్

టెక్నికల్ టీం
రచన, దర్శకత్వం: త్రినాధ్ కఠారి
నిర్మాత: బళ్లారి శంకర్
బ్యానర్: సంజీవని ప్రొడక్షన్స్
డీవోపీ: జగదీష్ చీకటి
సంగీతం: R P పట్నాయక్
ఎడిటర్: ఉద్ధవ్ SB
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మల్లికార్జున్
లైన్ ప్రొడ్యూసర్: బృంధావన్ కేతిరెడ్డి
కాస్ట్యూమ్ డిజైనర్: బృందావర్ధని అవ్వారు
పీఆర్వో: తేజస్వి సజ్జా

Vishwanath

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.