చంద్రకళ క్యారెక్టర్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది: అనస్వర రాజన్
స్వప్న సినిమాస్ అప్ కమింగ్ మూవీ 'ఛాంపియన్' ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణ లో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ అందించిన పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అనస్వర రాజన్ విలేకరలు సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. స్వప్న సినిమాస్ లాంటి ప్రతిష్టాత్మక బ్యానర్ లో ఛాంపియన్ సినిమాతో తెలుగులో లాంచ్ కావడం ఎలా అనిపిస్తోంది? -వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ లాంటి…
