Skip to content

‘ప్రేమనే ఊరిలో’.. ఈసారి కూడా హిట్ గ్యారెంటీ!

సురేష్ కొండేటి బ్రాండ్ వాల్యూతో ‘ప్రేమనే ఊరిలో’..అనే సినిమా రాబోతోంది. తెలుగు చిత్రసీమలో నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా, జర్నలిస్ట్‌గా తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న సురేష్ కొండేటి పేరు వినగానే ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది ఆయన సినిమాల ఎంపిక! విలక్షణమైన, కథాబలం ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించడంలో ఆయనది సిద్ధహస్తుడైన చెయ్యి. ఆయన నిర్మించిన లేదా సమర్పించిన 'ప్రేమిస్తే', 'జర్నీ', 'పిజ్జా', 'షాపింగ్ మాల్' వంటి ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సాధించిన ఘనవిజయం, ప్రేక్షకులకు ఆయనపై ఉన్న నమ్మకాన్ని మరింత పెంచింది. ఏ సినిమాలో అయినా ‘సురేష్ కొండేటి’ పేరు ఉందంటే.. అందులో ఖచ్చితంగా కంటెంట్ ఉంటుందని, అది ప్రేక్షకులను ఆకట్టుకుని ‘హిట్’ కావడం ఖాయమని టాలీవుడ్‌లో ఒక గట్టి నమ్మకం…

Read more

‘స్లమ్ డాగ్’ నుంచి పవర్‌ఫుల్ ఆఫీసర్ గౌరీ హెగ్డేగా టబు గ్లింప్స్ రిలీజ్

డైనమిక్ ఫిల్మ్‌మేకర్ పూరి జగన్నాథ్, వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతి మొదటిసారిగా కలసి చేస్తున్న పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్'. రా ఎమోషన్స్, పవర్‌ఫుల్ యాక్షన్, మిస్టరీ అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇప్పటికే టబు ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన మేకర్స్.. తాజాగా ఆమె పాత్రకు సంబధించిన పవర్‌ఫుల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. నగరంలోని స్లమ్ ఏరియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ గ్లింప్స్.. అక్కడి రఫ్ అండ్ గ్రిటీ వాతావరణాన్ని పరిచయం చేస్తూ మొదలవుతుంది. ఆ తర్వాత కారు దిగుతూ, సిగరెట్ వెలిగించి, పరిస్థితులను తన కంట్రోల్‌లోకి తీసుకునే గౌరి హెగ్డేగా టబు ఎంట్రీ ఇచ్చారు. స్థానిక గూండాకు వార్నింగ్ ఇచ్చి, ఆ వెంటనే చెంపదెబ్బ…

Read more

ఫస్ట్ వీకెండ్‌లోనే రూ.37.4 కోట్లకు పైగా వరల్డ్‌వైడ్ గ్రాస్‌తో బ్రేక్‌ఈవెన్ మార్క్‌ను దాటిన ‘కొరియన్ కనకరాజు’

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరోసారి తన బాక్సాఫీస్ స్టామినాను చూపించారు. హారర్ కామెడీగా తెరకెక్కిన ‘కొరియన్ కనకరాజు’ విడుదలైన మూడు రోజుల్లోనే అన్ని ఏరియాల్లో బ్రేక్‌ఈవెన్ మార్క్‌ను దాటుకుని ప్రాఫిట్ జోన్‌లోకి అడుగుపెట్టింది. మేకర్స్ మొదటి నుంచే పెట్టుకున్న నమ్మకానికి ఇప్పుడు ప్రేక్షకుల నుంచి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ మరింత బలాన్ని ఇస్తోంది. సినిమాకు సంబంధించిన పాజిటివ్ బజ్ పెయిడ్ ప్రీమియర్స్ నుంచే కనిపించాయి. అది ఇప్పుడు అద్భుతంగా వర్కౌట్ అయింది. ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ సినిమాకు బిగ్ ప్రమోషన్‌గా మారింది. రోజురోజుకూ ‘కొరియన్ కనకరాజు’కి ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమా హాఫ్ మిలియన్ డాలర్ల మార్క్‌కు చేరువలో ఉంది. సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌లో…

Read more

“ఇంద్రపుత్ర” ఫస్ట్ ఛాప్టర్ అనౌన్స్ మెంట్

"క", "కె ర్యాంప్", "చెన్నై లవ్ స్టోరీ" సినిమాలతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న హీరో కిరణ్ అబ్బవరం మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారు. "క" చిత్రంతో థ్రిల్లర్, "కె ర్యాంప్" తో మాస్ ఎంటర్ టైనర్, "చెన్నైలవ్ స్టోరీ"తో ఎమోషనల్ లవ్ స్టోరీ చేసిన కిరణ్ అబ్బవరం వైవిధ్యమైన జానర్స్ ను ఎంచుకుంటూ హీరోగా తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. ఈ క్రమంలో జాయ్ ఫిలింస్ లో ఓ సినిమా, "కెఎ 13" అనే మరో సినిమాతో పాటు సుకుమార్ రైటింగ్స్ లో "కెఎ 14" సినిమా చేస్తున్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు "కెఎ15" గా భారీ మైథాలజీ మూవీని ప్రకటించారు. జీ స్టూడియోస్, ప్రేరణ…

Read more

‘కిల్లర్’కు ఓవర్సీస్‌లో భారీ బజ్

OMG Pictures చేతికి అంతర్జాతీయ డిస్ట్రిబ్యూషన్ హక్కులు✅ జ్యోతి పూర్వజ్ #SuperSHE చిత్రం తెలుగు, తమిళ భాషల్లో అమెరికా, యూరప్, కెనడా, అరబ్ దేశాలు సహా పలు దేశాల్లో విడుదల. హైదరాబాద్: వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ‘కిల్లర్’కు అంతర్జాతీయ స్థాయిలో మరో కీలక ముందడుగు పడింది. పూర్వాజ్ రచన, దర్శకత్వం, నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను OMG Pictures సొంతం చేసుకుంది. ఉర్వీష్ పూర్వజ్ సమర్పణలో, THINK CINEMA బ్యానర్‌పై తెరకెక్కుతున్న ‘కిల్లర్’లో జ్యోతి పూర్వజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మహిళా ప్రధాన కథాంశంతో సైన్స్ ఫిక్షన్, మిస్టరీ, యాక్షన్, థ్రిల్లర్, ఎమోషనల్ డ్రామా అంశాలను మేళవిస్తూ ఈ చిత్రాన్ని…

Read more

ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు ఆవిష్కరించిన ‘హుషార్‌ పిట్టలు’ ట్రైలర్‌!

అన్షు, వాసవి గణేషన్‌ జంటగా రూపొందుతోన్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'హుషారు పిట్టలు'. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్‌ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్‌ పతాకంపై వెంకట్‌ యాదవ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బిక్షు దర్శకుడు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఏషియన్‌ సురేష్‌ ఫిలింస్‌ సంస్థలు విడుదల చేస్తున్నాయి. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని థియేట్రికల్‌ రిలీజ్‌ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌, పాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ చిత్రం ట్రైలర్‌ను మేకర్స్‌ సోమవారం ఉదయం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు విచ్చేసి ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్బంగా ప్రముఖ నిర్మాత…

Read more

ఈ నెల 14న ‘పాంచాలి పంచభర్తృక’ మూవీ రిలీజ్

డా. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘పాంచాలి పంచభర్తృక’. ఈ చిత్రంలో సరీ ఫర్, రోల్ రిడా, రాజ్ పవన్, జెమినీ సురేష్, వెంకట్ దుగ్గిరెడ్డి ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఫ్యామిలీ డ్రామాతో కూడిన కంప్లీట్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు గంగ సప్తశిఖర. ఈ చిత్రాన్ని రాయల్ థ్రోన్ ప్రొడక్షన్స్‌, ఓం సాయిరాం ఆర్ట్స్‌ బ్యానర్స్ పై వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్‌ఏ), రాజ్ పవన్ శ్రీకాంత్ సెట్టివారి, సాయినాథ్ మణ్యం నిర్మించారు. ఈ నెల 14న ‘పాంచాలి పంచభర్తృక’ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆదివారం సాయంత్రం హైదరాబాద్…

Read more

‘కపాలి’ నుంచి హన్సిక మోత్వాని ఫస్ట్ లుక్ రిలీజ్

హీరో రోహిత్ నారా ప్రస్తుతం పోలీస్ నేపథ్యంలో సాగే సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌ 'కపాలి' లో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు రామ్ గన్ని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సప్త అశ్వ మీడియా వర్క్స్ బ్యానర్‌పై కళ్యాణ చక్రవర్తి మంథినా, భాను కిరణ్ ప్రతాప నిర్మించగా, విజయ్ కృష్ణ లింగమనేని సమర్పిస్తున్నారు. ఇందులో హన్సిక మోత్వాని కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్, ఫస్ట్-లుక్ పోస్టర్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా హన్సిక మోత్వానీ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. హన్సిక పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ లుక్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇంటెన్స్ లుక్‌లో హన్సిక కనిపిస్తున్న ఈ పోస్టర్.. 'కపాలి' కథలో ఆమె పాత్రకు ఉన్న…

Read more

“సుధీర్స్ జోకర్” సినిమా నుంచి వెర్సటైల్ యాక్టర్ మురళీశర్మ బర్త్ డే పోస్టర్ రిలీజ్

"సుధీర్స్ జోకర్" చిత్రంలో డిటెక్టివ్ జీవన్ పాత్రలో ఆకట్టుకోనున్న మురళీశర్మ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "సుధీర్స్ జోకర్". బిగ్ బాస్ ఫేమ్ అయేషా ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం కాబోతోంది. ఈ చిత్రంలో అభిరామి, మురళీ శర్మ, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, విష్ణు ఓయ్, మురళీధర్ గౌడ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అందరి ప్రశంసలు అందుకున్న పరదా లాంటి విభిన్నమైన చిత్రం తర్వాత ఆనంద మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ శ్రీనివాసులు పి.వి., విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. పీఎస్ సునీల్ పుప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు వెర్సటైల్ యాక్టర్ మురళీశర్మ బర్త్ డే సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ…

Read more

మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ‘వారణాసి’ నుంచి రెండు స్పెషల్ స్టిల్స్‌ను విడుదల

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘వారణాసి’ చిత్రం నుండి రెండు ప్రత్యేక స్టిల్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ స్టిల్స్‌తో రుద్ర తన నేచురల్ లుక్‌లో ప్రపంచానికి తొలిసారిగా కనిపించాడు. మొదటి స్టిల్‌లో దట్టమైన అడవి మధ్యలో ఒక వెదురు తెప్పపై విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా రుద్ర కనిపిస్తున్నాడు. ఇక ఆ స్టిల్‌ను చూస్తే పాలసంద్రంలో ఆదిశేషుపై సేదతీరే శ్రీ మహా విష్ణువులా కనిపిస్తున్నారు. ఇంకో స్టిల్‌లో కెన్యాలోని మసాయి మారా విశాలమైన మైదానాలకు చెందింది. అక్కడ రుద్ర జిరాఫీలు, వైల్డ్‌బీస్ట్‌ల మధ్య నిలబడి, వెనక్కి తిరిగి చూస్తున్నాడు. ఈ రెండు స్టిల్స్‌ను గమనిస్తే ‘వారణాసి’ సినిమాలోని సోల్, రుద్ర పాత్ర తీరు గురించి అందరికీ…

Read more