రష్మిక మందన్న, రవీంద్ర పుల్లె, అన్‌ఫార్ములా ఫిల్మ్స్ పాన్ ఇండియా మూవీ 'మైసా' గూస్బంప్స్ ఇంటెన్స్…
బాలకృష్ణ సతీమణి వసుంధర తిరుమలలో శ్రీవారి శాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఆరవ రోజు జరిగిన స్వర్ణ రథయాత్రలో పాల్గొన్నారు.

తిరుమల, 20 సెప్టెంబర్ 2026: నటుడు, ఎమ్మెల్యే శ్రీ నందమూరి బాలకృష్ణ గారి సతీమణి శ్రీమతి వసుంధర గారు, తిరుమలలో శ్రీవారి శాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఆరవ రోజు జరిగిన స్వర్ణ రథయాత్రలో పాల్గొన్నారు. ఈ రథయాత్ర సందర్భంగా, శ్రీమతి వసుంధర గారిని ఎస్‌విబిసి ఛైర్మన్ శ్రీ బి. శ్రీధర్ వర్మ గారు కలిసి ఆమె ఆశీర్వాదాలు పొందారు. శ్రీధర్ వర్మ గారికి వసుంధర దేవి గారు ఎస్విబిసి చైర్మన్ గా ఎన్నికైనందుకుగాను శుభాకాంక్షలు తెలిపి ఆయనను అభినందించారు. అలాగే ఎస్వీబీసీ చైర్మన్ శ్రీధర్ వర్మ గారు కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని శ్రీధర్ వర్మ గారు ఆకాంక్షించారు.

