ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ సమస్యలకు ఇద్దరి మధ్య కోల్డ్ వారే కారణం: నట్టి కుమార్
ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్...ఇలా ఎవరి సమస్యలు వారికి ఉన్నాయని, వాటిని కూర్చుని చర్చించుకుని ఎవరికీ ఇబ్బందులు తలెత్తని రీతిలో సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీనియర్ ప్రొడ్యూసర్స్ నట్టి కుమార్ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ, "నేను నిర్మాతను, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ గా కూడా సుదీర్ఘ అనుభవంతో చెబుతున్నాను. ఎగ్జిబిటర్స్ అయినా నిర్మాతలు అయినా కేవలం తమ సమస్యలు మాత్రమే హైలైట్ చేసుకోవడం, అవి మాత్రమే పరిష్కారం కావాలనుకోవడం కరెక్ట్ కాదు. సమస్యను ఎప్పుడైనా రెండు వైపులా చూడాలి. ఇప్పుడు అలా చూడకుండా తమ సమస్య మాత్రమే పరిష్కారం కావాలని కోరుకుంటున్నారు. నిన్న ఎగ్జిబిటర్స్ పెట్టిన…
