ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పి. భరత్ భూషణ్ నియామకం
చైర్మన్ భరత్ భూషణ్ ను అభినందించిన పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ ఆంధ్ర ప్రదేశ్ ఎఫ్ డి సి చైర్మన్ గా నియమింపబడ్డ భరత్ భూషణ్ పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారిని కలవగా ఆయన భరత భూషణ్ కు అభినందనలు తెలిపారు. అందరినీ కలుపుకుంటూ ఆంధ్ర ప్రదేశ్ లో సినీ, టీవీ మరియు నాటక రంగ అభివృద్ధి కోసం ముందుకు సాగాలని నందమూరి బాలకృష్ణ గారు సూచించారు సినిమాలపై మక్కువతో 20 సంవత్సరాలుగా సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఎన్నో విజయవంతమైన సినిమాలను ప్రేక్షకులకు అందిస్తూ వచ్చారు భరత్ భూషణ్. అలాగే భరత్ ఇన్ఫ్రా అనే కంపెనీ స్థాపించి తద్వారా ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు అందించారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గా తనదైన శైలిలో…
