Skip to content

భారీ పాన్ ఇండియా యాక్షన్ మూవీ “వేట్టువం” ఫస్ట్ లుక్ పోస్టర్, వరల్డ్ ఆఫ్ “వేట్టువం” వీడియో రిలీజ్

సరికొత్త కథా నేపథ్యాలతో అద్భుతమైన మేకింగ్ తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసే దర్శకుడు పా. రంజిత్ “వేట్టువం” టైటిల్ తో మరో భారీ యాక్షన్ చిత్రాన్ని మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో ఆర్య, వి.ఆర్. దినేష్, శోభిత ధూళిపాళ్ల, కలైయరాసన్, మైమ్ గోపి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. “వేట్టువం” సినిమాను లెర్న్ అండ్ టీచ్ ప్రొడక్షన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రొడ్యూసర్స్ ఎస్. సాయి దేవానంద్, ఎస్. సాయి వెంకటేశ్వరన్, పా.రంజిత్ నిర్మిస్తున్నారు. భారీ పాన్ ఇండియా యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న “వేట్టువం” సినిమా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ రోజు “వేట్టువం” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు వరల్డ్ ఆఫ్ వేట్టువం వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోకు తెలుగులో రానా దగ్గుబాటి, మలయాళంలో సౌబిన్ షాహిర్, కన్నడ వెర్షన్ కు కిచ్చా సుదీప్, తమిళంలో పా. రంజిత్ వాయిస్ అందించారు.

ఈ సినిమాను ఎంత భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో , ఎన్ని వ్యయప్రయాసలతో తెరకెక్కించారో, ఎలాంటి కథను ప్రేక్షకులకు చూపించబోతున్నారో వరల్డ్ ఆఫ్ “వేట్టువం” వీడియోలో మేకర్స్ తెలియజేశారు. పూర్వకాల ప్రజల జీవన విధానం వల్ల ఏర్పడిన ప్రభావం ప్రస్తుతాన్ని ఎలా మార్చింది దాని ఫలితంగా ప్రకృతి సృష్టించే విపత్తు ఏంటి ? భవిష్యత్ లో ఎలాంటి మార్పులు రాబోతాయంటూ మూడు కాలాల గురించి డిస్కస్ చేస్తుందీ సినిమా. ఎవరు బలవంతులు, అధికారం ఎవరికుండాలి అని నిరూపించుకోవడానికి కొన్ని తెగల మధ్య జరిగే పోరాటే ఈ “వేట్టువం” సినిమా అంటూ వరల్డ్ ఆఫ్ వేట్టువం తెలుపుతుంది. ఈ చిత్రంలో ధర్మరాజన్ అనే పాత్రలో ఆర్య, సేంబియన్ క్యారెక్టర్ లో షబీర్, కలైయరాసన్ పాత్రలో వీరవర్మన్, రాధి క్యారెక్టర్ లో శోభిత ధూళిపాళ్ల, వె.ర.దినేష్ నందన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం నటీనటులు ఎంతో శ్రమించి అడిమురై, మాల్కమ్ వంటి సంప్రదాయ యుద్ధకళలతో పాటు మార్షల్ ఆర్ట్స్ ను నేర్చుకున్నారు అనేది ఈ వీడియోలో ఆకట్టుకుంటోంది. “వేట్టువం”తో దర్శక నిర్మాత పా.రంజిత్ మరో భారీ ప్రయత్నం చేసినట్లు ఈ వీడియో ద్వారా తెలుస్తోంది.

నటీనటులు – ఆర్య, వి.ఆర్. దినేష్, శోభిత ధూళిపాళ్ల, కలైయరాసన్, మైమ్ గోపి, గురు సోమసుందరం, షబీర్ కల్లరక్కల్, జాన్ విజయ్, సాయి దీన, ఆనంద్ సామి, హరీశ్ ఉత్తమన్, లిజీ, లింగేష్ ప్రేమ్ కుమార్, కవిత భారతి, అర్ుజన్, శాంతకుమార్, మెలొడీ మనీషా, నిమ్మి, రాఫేల్, విక్రమ్, నవీన్, ప్రకాశ్, తదితరులు

టెక్నీషియన్స్
———————-
యాక్షన్ – దిలీప్ సుబ్బరాయన్
ఆర్ట్ డైరెక్టర్ – ఎస్ఎస్ మూర్తి
ఎడిటర్ – సెల్వ ఆర్.కె.
డీవోపీ – రూపేష్ షాజి
మ్యూజిక్ – జి.వి.ప్రకాష్ కుమార్
కో రైటర్స్ – సంతోష్ నారాయణన్ చెందిల్ కుమార్
బ్యానర్స్ – లెర్న్ అండ్ టీచ్ ప్రొడక్షన్, నీలమ్ ప్రొడక్షన్స్
ప్రొడ్యూసర్స్ – ఎస్. సాయి దేవానంద్, ఎస్. సాయి వెంకటేశ్వరన్, పా.రంజిత్
స్క్రిప్ట్, డైరెక్షన్ – పా. రంజిత్
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కే మీడియా)

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.