Skip to content

‘సిగ్మా’ హీస్ట్ అడ్వెంచర్‌ ట్రైలర్ రిలీజ్

సందీప్ కిషన్ యాక్షన్-అడ్వెంచర్, హీస్ట్ కామెడీ ఎంటర్టైనర్ ‘సిగ్మా’ అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాతో జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రతిష్టాత్మక లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రంపై ప్రమోషనల్ కంటెంట్‌తో ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాకు సంబంధించిన డిఫరెంట్ వరల్డ్‌ను, యాక్షన్‌ టచ్‌ను పరిచయం చేశాయి. కోస్తాంధ్ర, తెలంగాణలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండగా, సీడెడ్ ప్రాంతంలో ఎన్వీఆర్ సినిమా విడుదల చేస్తుంది. తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

మోసపోయిన హీరో, జరిగిన దాన్ని మర్చిపోయి ముందుకు వెళ్లకుండా.. తనకు జరిగిన నష్టాన్ని తిరిగి సాధించుకోవాలని పోరాటం మొదలుపెడతాడు. డ్రగ్స్, గ్యాంబ్లింగ్‌కు సంబంధించిన రూ.500 కోట్ల భారీ రాకెట్ ఈ కథలో కీలకంగా ఉంటుంది. దీంతో హీరో క్రైమ్, మోసం, ప్రమాదాలతో కూడిన ప్రపంచంలోకి అడుగుపెడతాడు.

మరోవైపు ఓ ఆర్‌జేతో ప్రేమలో ఉన్న హీరో.. తన స్నేహితుల సహాయంతో భారీ హీస్ట్‌కు ప్లాన్ చేస్తాడు. అయితే ఎంతో పక్కాగా వేసుకున్న ఆ ప్లాన్‌కు రెడ్డి అడ్డుపడటంతో మొత్తం ఆపరేషన్ గందరగోళంగా మారుతుంది. ఓటమిని అంగీకరించని హీరో మరింత బలంగా తిరిగి వచ్చి.. అన్ని అడ్డంకులను అధిగమించి తన లక్ష్యాన్ని ఎలా సాధించాడనేది ఆసక్తికరంగా మారింది.

ఆసక్తికరమైన హీస్ట్ కథను ఎంచుకున్న జేసన్ సంజయ్.. యాక్షన్, అడ్వెంచర్, ఫన్, ఎమోషన్‌ను ఎంగేజింగ్‌గా మిక్స్ చేసినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ముఖ్యంగా తల్లి-కొడుకు ఎమోషన్ సినిమాకు మంచి డెప్త్‌ను తీసుకొచ్చేలా కనిపిస్తోంది. థ్రిల్లింగ్ నెరేషన్‌తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్‌కు ఈ ఎమోషన్ మరింత బలం చేకూరుస్తోంది.

సందీప్ కిషన్ తనదైన స్వాగ్‌తో క్యారెక్టర్‌లో ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. ఆయనకు జోడీగా ఫారియా అబ్దుల్లా కీలక పాత్రలో కనిపించారు. వీరిద్దరి కెమిస్ట్రీ బాగుంది. రాజు సుందరం తన కామెడీతో ఫ్రెష్‌నెస్ తీసుకురాగా.. సంపత్ రాజ్ రెడ్డి పాత్రలో పవర్‌ఫుల్ ఇంపాక్ట్ చూపించారు. శివ పండిట్, అన్బు తాసన్, యోగ్ జపీ కీలక పాత్రల్లో కనిపించారు.

కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ స్టైలిష్, కాంటెంపరరీ విజువల్స్‌తో ఆకట్టుకుంటోంది. యాక్షన్, అడ్వెంచర్ ప్రపంచాన్ని యాటిట్యూడ్‌తో ప్రజెంట్ చేశారు. ఎస్. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత ఇంటెన్సిటీ, ఎనర్జీని తీసుకొచ్చింది. ప్రవీణ్ కేఎల్ షార్ప్ కట్స్‌తో నెరేషన్‌ను క్రిస్ప్‌గా ఉంచారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు గ్రాండ్‌గా కనిపిస్తున్నాయి.

యాక్షన్‌తో కూడిన హీస్ట్ కథ, జేసన్ సంజయ్ డైరెక్టోరియల్ డెబ్యూ, సందీప్ కిషన్ లీడ్ పెర్ఫార్మెన్స్‌తో ‘సిగ్మా’ ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.