ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ తో “లిటిల్ హార్ట్స్” నవ్వించింది – ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన "లిటిల్ హార్ట్స్" సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణతో పాటు సెలబ్రిటీల ప్రశంసలు లభిస్తున్నాయి. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ "లిటిల్ హార్ట్స్" సినిమా చూసి ఫ్రెష్ లవ్ స్టోరీ, ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ తో ఆకట్టుకుందని ప్రశంసించారు. అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ - లిటిల్ హార్ట్స్ సినిమా చూశాను. ఎలాంటి మెలొడ్రామా, సందేశాలు లేకుండా బాగా నవ్వించింది. ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఉన్న ఫ్రెష్ లవ్ స్టోరీతో ఆకట్టుకుంది. మౌళి, శివానీ తమ పర్ ఫార్మెన్స్ తో మెప్పించారు. ఇతర నటీనటులంతా బాగా నటించారు…
