ప్రేక్షకుల స్పందనతో మా కష్టం మర్చిపోయాం: హీరో కికు యనమల
కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటించిన యూనిక్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ "చిరంజీవి" రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాను కికు ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దీప్తి నడిమింటి నిర్మించారు. శుభ సాయి వెంకట్ దర్శకత్వం వహించారు. "చిరంజీవి" సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో బాక్సాఫీస్ వద్ద రక్షాబంధన్ విన్నర్ గా మారింది. ఈ నేపథ్యంలో చిత్ర గ్రాండ్ సక్సెస్ మీట్ ను ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎడిటర్ ఛోటా కె ప్రసాద్ మాట్లాడుతూ - ఈ టీమ్ లోని వాళ్లంతా ఒక కొత్త కథను, ఎక్స్ట్రార్డినరీ కాన్సెప్ట్ ను నమ్మి నిజాయితీగా కష్టపడి…
