Skip to content

‘ఫీనిక్స్ రాజా’ పవర్‌ఫుల్ ఫస్ట్ పోస్టర్ రిలీజ్

ప్రముఖ దర్శకుడు శ్రీవాస్ తన ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రకటించారు. మహంకాళి నాగరాజు నిర్మాణంలో, మాధవి క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘ఫీనిక్స్ రాజా’ అనే టైటిల్ ఖరారు చేశారు. అరిగపూడి సుమిత్ కుమార్, శైలేష్ భంబురే, శ్యామ్ బొడపాటి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.ముంబైలోని జుహూలో నోవాటెల్ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ‘ఫీనిక్స్ రాజా’ ఫస్ట్ పోస్టర్‌తో పాటు రెండు నిమిషాల పవర్‌ఫుల్ 2D మోషన్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ ప్రమోషనల్ కంటెంట్‌ను కార్యక్రమానికి హాజరైన మీడియా ప్రతినిధుల చేతుల మీదుగానే ఆవిష్కరించడం విశేషం. ఇంగ్లిష్‌తో పాటు పలు భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని భారత్‌లోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల్లోనూ భారీ స్థాయిలో తెరకెక్కించనున్నారు. వాస్తవ సంఘటనలను, ప్రభావవంతమైన కథనంతో…

Read more

నటుడు, నిర్మాత జి.వి. నారాయణరావు కి నివాళులు అర్పించిన చిరంజీవి

ప్రముఖ నటుడు, నిర్మాత జి.వి. నారాయణరావు గారి పార్థివ దేహానికి మెగాస్టార్ చిరంజీవి గారు నివాళులు అర్పించారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరిగిన అంత్యక్రియలకు హాజరైన చిరంజీవి గారు, నారాయణరావు గారితో తనకున్న అనుబంధాన్ని, ఆత్మీయ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడుతూ.. ఫిలిం ఇన్‌స్టిట్యూట్ రోజుల నుంచి మా ఇద్దరి పరిచయం. తను అప్పటికే ఇన్‌స్టిట్యూట్‌లో సీనియర్. మేము ట్రైనింగ్ అవుతున్నప్పుడు తను వచ్చి తన అనుభవాలను పంచుకునేవారు. అలా మాకు దగ్గరయ్యారు. ఇండస్ట్రీలో ఎవరికి వాళ్లం ఎదిగినప్పుడు, నాకు ఒక స్టార్ ఇమేజ్ వచ్చినప్పుడు ‘‘నేను నిర్మాతగా నిలబడాలనుకుంటున్నాను. నువ్వు సినిమాలు చేయాలని’’ అడిగారు. అలా ఆయన నిర్మాణంలో రెండు చిత్రాలు చేయడం జరిగింది. నా సినిమాల్లో…

Read more

నిధి అగర్వాల్ చేతుల మీదుగా ‘కలర్స్ 2.0’ ప్రారంభం

హైదరాబాద్: ప్రముఖ హెల్త్ అండ్ వెల్‌నెస్ సంస్థ కలర్స్ హెల్త్‌కేర్ హైదరాబాద్‌లోని కొంపల్లిలో తన నూతన ‘కలర్స్ 2.0’ (Kolors 2.0) వెల్‌నెస్ సెంటర్‌ను ఘనంగా ప్రారంభించింది. హీరోయిన్ నిధి అగర్వాల్ ముఖ్య అతిథిగా హాజరై నూతన శాఖను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. ఈ రోజుల్లో సోషల్ మీడియా వల్ల అందంగా, ఫిట్‌గా కనిపించడం మరింత ముఖ్యాంశంగా మారింది. కలర్స్ 2.0 లో లేటెస్ట్ టెక్నాలజీ, కొత్త మెషిన్లు, నిపుణులైన డాక్టర్లు ఉన్నారు. ఇలాంటి మంచి వాతావరణంలో హెల్త్, డైటింగ్ పై శ్రద్ధ పెడితే మరింత మోటివేషన్ లభిస్తుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అధునాతన వెల్‌నెస్ సదుపాయాలతో కలర్స్…

Read more

రోజా సెల్వ‌మ‌ణి క‌మ్ బ్యాక్ ఫిల్మ్ ‘అన్బే డ‌యానా’..సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘అన్బే డయానా’ చిత్రం థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఇప్పుడు సోనీ లివ్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రేమ, కామెడీ, మ‌న నెటివిటీకి, మ‌న‌ సంస్కృతి, కుటుంబ అనుబంధాల మేళవింపుగా రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు మరింత విస్తృత ప్రేక్షకులకు చేరువ కానుంది. ప్రేక్షకులు తమ ఇంటి నుంచే ఈ అందమైన కథను ఆస్వాదించే అవకాశం. చెన్నైలోని పెరంబూర్ నేపథ్యంగా తెరకెక్కిన ‘అన్బే డయానా’ సినిమా కథ, సంప్రదాయాలకు కట్టుబడి ఉండే ఓ యువకుడి జీవితంలో చోటుచేసుకునే ఊహించని మలుపుతో ఏం జరిగింద‌నే పాయింట్‌ చుట్టూ సాగుతుంది. స్వేచ్ఛగా జీవించే ఓ ఆంగ్లో-ఇండియన్ యువతితో అతడు ప్రేమలో పడటంతో రెండు విభిన్న ప్రపంచాలు…

Read more

‘సహ’ సినిమా గుర్తుండిపోయే సినిమా అవుతుంది – నిర్మాత బన్నీవాసు

శివ కుమార్ కాసారం, నిషాంత్ దోటి, తేజేశ్వర్ వెల్పుచర్ల, సుమైరా స్టూడియోస్ ‘సహ' (లైఫ్ ఆఫ్ సంజు)’ ఎమోషనల్ జర్నీ ట్రైలర్ లాంచ్ నిషాంత్ దోటి దర్శకత్వంలో కుమార్ కాసారం హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సహ (లైఫ్ ఆఫ్ సంజు)’ ఇప్పటికే ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి అంచనాలను పెంచింది. ఈ చిత్రంలో శ్వేతా లక్ష్మణ్, వ్రజన పాండ్య కథానాయికలుగా నటిస్తున్నారు. సుమైరా స్టూడియోస్ బ్యానర్‌పై తేజేశ్వర్ వెల్పుచర్ల నిర్మిస్తున్నారు. మేకర్స్ తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. సంజు జీవితంలోని బాల్యం, స్కూల్ డేస్, కాలేజీ, తొలి ప్రేమ, వివాహం.. ఆ తర్వాత చోటుచేసుకునే భావోద్వేగ మలుపులు ఇలా అతడి జీవితంలోని కీలక దశలన్నీ ట్రైలర్‌లో కనిపిస్తాయి. అయితే…

Read more

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా అందరికీ కనెక్ట్ అయ్యే ఎంటర్‌టైనర్: హీరోయిన్ రాశి సింగ్

అల్లరి నరేష్, చంద్ర మోహన్ చింతాడ, అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ 'రంభ ఊర్వశి మేనక' టైటిల్ సాంగ్ లాంచ్ అల్లరి నరేష్ ఫాంటసీ కామెడీ 'రంభ ఊర్వశి మేనక'తో అలరించబోతున్నారు. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వంలో, అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించారు. సురభి, రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ హీరోయిన్స్ గా నటించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ టీజర్ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఘనంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ రాశి సింగ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మా టీజర్‌కి,…

Read more

‘ఘమాసాన్’ సెప్టెంబర్ 11న జీ5లో స్ట్రీమింగ్‌

అర్షద్ వార్సీ, ప్రతీక్ గాంధీ ఇషితా ద‌త్తా ప్ర‌ధాన పాత్ర‌ల్లో టిగ్మాన్షు ధూలియా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం - బలమైన కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఒకే ఆలోచనతో ఏర్పడే క్రియేటివ్ కాంబినేష‌న్స్‌ ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తాయి. వైవిధ్యమైన కథలను ప్రోత్సహించడం, ధైర్యమైన సృజనాత్మక నిర్ణయాలు తీసుకోవడం, ప్రేక్షకులను కేంద్రంగా చేసుకుని వినోదాన్ని అందించాలనే ఆలోచనతో జీ5, జియో స్టూడియోస్, గోల్డెన్ రేషియో ఫిల్మ్స్ కలిసి ఓ ప్రత్యేకమైన కథతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాయి. ఆ సినిమాయే ‘ఘమాసాన్’. ప్రతీక్ గాంధీ, అర్షద్ వార్సీ, ఇషితా దత్తా కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ట్రైలర్‌ను జీ5, జియో స్టూడియోస్, గోల్డెన్ రేషియో ఫిల్మ్స్ బుధ‌వారం రోజున విడుదల చేశాయి. ఈ చిత్రం…

Read more

‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్ 28న లాంచ్

నేచురల్ స్టార్ నాని మోస్ట్ అవైటెడ్ పాన్-వరల్డ్ చిత్రం ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ సినిమాను ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్, టీజర్‌కు భారీ స్పందన వచ్చింది. ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’ చార్ట్‌బస్టర్‌గా నిలిచి సినిమాపై అంచనాలను మరింత పెంచింది. తాజాగా మేకర్స్ సెకండ్ సింగిల్‌కి సంబంధించిన అప్‌డేట్‌ను ప్రకటించారు. తన మ్యూజిక్‌తోనే కాకుండా పాటలను సరికొత్తగా పెర్ఫామ్ చేయడంలోనూ ట్రెండ్ సెట్ చేసే రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈసారి కూడా ప్రత్యేకమైన ప్లాన్‌తో ముందుకొచ్చారు. హై ఎనర్జీ ఫోక్ మాస్ ఆంథమ్‌గా రూపొందిన ఈ పాటను ఆగస్టు 28న అమెరికాలోని డల్లాస్‌లో జరగనున్న…

Read more

“సమ్మర్ హాలిడేస్” సినిమా నుంచి 29న ‘స్కూల్ సాంగ్’ రిలీజ్

కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన తన ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై "సమ్మర్ హాలిడేస్" అనే చిల్డ్రన్ మూవీని నిర్మిస్తున్నారు. "సమ్మర్ హాలిడేస్" సినిమాను మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే "సమ్మర్ హాలిడేస్" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. "సమ్మర్ హాలిడేస్" సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ సక్సెస్ ఫుల్ గా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన 'క్రష్…

Read more

అక్టోబర్ 16న “రణబాలి” సినిమా రిలీజ్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ "రణబాలి". ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై "రణబాలి" సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా "రణబాలి" సినిమా రూపొందుతోంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా అక్టోబర్ 16న విజయదశమి పర్వదినం సందర్భంగా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్…

Read more