Skip to content

‘ఫీనిక్స్ రాజా’ పవర్‌ఫుల్ ఫస్ట్ పోస్టర్ రిలీజ్

ప్రముఖ దర్శకుడు శ్రీవాస్ తన ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రకటించారు. మహంకాళి నాగరాజు నిర్మాణంలో, మాధవి క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘ఫీనిక్స్ రాజా’ అనే టైటిల్ ఖరారు చేశారు. అరిగపూడి సుమిత్ కుమార్, శైలేష్ భంబురే, శ్యామ్ బొడపాటి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.ముంబైలోని జుహూలో నోవాటెల్ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ‘ఫీనిక్స్ రాజా’ ఫస్ట్ పోస్టర్‌తో పాటు రెండు నిమిషాల పవర్‌ఫుల్ 2D మోషన్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ ప్రమోషనల్ కంటెంట్‌ను కార్యక్రమానికి హాజరైన మీడియా ప్రతినిధుల చేతుల మీదుగానే ఆవిష్కరించడం విశేషం.

ఇంగ్లిష్‌తో పాటు పలు భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని భారత్‌లోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల్లోనూ భారీ స్థాయిలో తెరకెక్కించనున్నారు. వాస్తవ సంఘటనలను, ప్రభావవంతమైన కథనంతో చూపిస్తూ కొత్త బెంచ్‌మార్క్‌ సెట్ చేయడమే లక్ష్యంగా సినిమా రూపొందిస్తున్నట్లు దర్శకుడు శ్రీవాస్ తెలిపారు.

‘ఫీనిక్స్ రాజా’ కథ ఓ నిజాయితీగల వ్యాపారవేత్త చుట్టూ తిరుగుతుంది. రాజకీయ పలుకుబడి, అధికారాన్ని ఉపయోగించుకోకుండా కష్టపడి, విలువలు, నిజాయితీతో జీవితాన్ని నిర్మించుకోవాలని భావించే అతడి జీవితంలోకి పవర్ ఫుల్ వ్యక్తులు ప్రవేశించినప్పుడు.. అతడి వ్యక్తిగత పోరాటం కాస్తా నిజం, గౌరవం, భవిష్యత్ తరాల కోసం జరిగే పెద్ద పోరాటంగా మారుతుంది.

ఈ చిత్రంలో మరో కీలక అంశంగా జెన్‌జీపై డ్రగ్ మాఫియా పెరుగుతున్న ప్రభావాన్ని చూపించనున్నారు. “జెన్‌జీ భవిష్యత్తును నియంత్రించగలిగితే.. రేపటిని ఎవరు నియంత్రిస్తారు?” అనే ప్రశ్నను సినిమా లేవనెత్తనుంది. అధికారం, రాజకీయాలు, డ్రగ్ నెట్‌వర్క్‌లు, న్యాయ వ్యవస్థ చుట్టూ కథ సాగనుంది.

‘ఫీనిక్స్ రాజా’ టైటిల్‌కు వెనుక ఉన్న భావన కూడా ఆసక్తికరంగా ఉంది. ఫీనిక్స్ పక్షి పునర్జన్మ, మనుగడ, అణచివేయలేని సత్యానికి ప్రతీక. “సత్యాన్ని కాల్చవచ్చు.. పాతిపెట్టవచ్చు.. అణచివేయవచ్చు.. కానీ నాశనం చేయలేరు” అనే భావన ఈ కథకు ప్రధాన థీమ్ గా నిలవనుంది.

రెండు నిమిషాల 2D మోషన్ టీజర్‌లో ప్రధాన పాత్రలను పూర్తిగా రివీల్ చేయకుండా కథలోని ప్రపంచాన్ని మాత్రమే పరిచయం చేశారు. కార్పొరేట్ పవర్, రాజకీయ ఎత్తుగడలు, డ్రగ్ నెట్‌వర్క్‌లు, న్యాయం, సత్యం వంటి అంశాలను టీజర్‌లో చూపించారు.

“అసలు ఫీనిక్స్ రాజా ఎవరు?” అనే ప్రశ్నతో టీజర్‌ను ముగించడం ఆసక్తిని మరింత పెంచింది.

ప్రస్తుత సమాజంలో జరుగుతున్న వాస్తవ సంఘటనలు, నిజ జీవిత పరిస్థితులను ఆధారంగా చేసుకుంటూనే బిగ్గర్ ద్యాన్ లైఫ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించేలా శ్రీవాస్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. భారత్‌లోని పలు ప్రాంతాలతో పాటు విదేశాల్లోనూ షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో నిర్మించనున్నారు.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించిన నటీనటులు, సాంకేతిక బృందం, ఇతర నిర్మాణ వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

సాంకేతిక సిబ్బంది:
రచన & దర్శకత్వం: శ్రీవాస్
నిర్మాత: మహంకాళి నాగరాజు
సహ నిర్మాతలు: అరిగపూడి సుమిత్ కుమార్, శైలేష్ భంబురే, శ్యామ్ బోడపాటి
సీఈఓ: మున్నంగి ప్రభాకర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కరుణాకర్ బొల్లా
ప్రొడక్షన్ హెడ్: దేబేంద్ర జగదల (డెబ్)
PRO: వంశీ-శేఖర్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.