Skip to content

‘అనుమాన పక్షి’ సెప్టెంబర్ 18న రిలీజ్

‘డిజె టిల్లు’ చిత్రంతో సెన్సేషనల్ డెబ్యూ చేసిన దర్శకుడు విమల్ కృష్ణ, రాగ్ మయూర్ కథానాయకుడిగా నటిస్తున్న మరో యునిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అనుమాన పక్షి’తో అలరించబోతున్నారు. చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హీరాచంద్ దండ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

‘అనుమాన పక్షి’ సెప్టెంబర్ 18న థియేటర్లలోకి రానుందని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల తేదీని తెలియజేస్తూ ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేశారు. సినిమా విభిన్నమైన టోన్‌తో పాటు హీరో విచిత్రమైన ఆలోచనా విధానాన్ని ఈ పోస్టర్ ప్రజెంట్ చేస్తోంది.

రాగ్ మయూర్ సంప్రదాయ దుస్తుల్లో చేతిలో రైఫిల్ పట్టుకుని కనిపిస్తున్నారు. ఆయన పక్కనే ఉన్న బ్లాక్‌బోర్డుపై “Doubts Under Investigation” అనే టైటిల్‌తో జీవితం, విధి, కర్మ, దేవుడి ప్లనిన్గ్స్ సంబంధించిన ఆసక్తికరమైన ప్రశ్నలను పొందుపరిచారు. “One Boy. Billion Thoughts. Zero Chill.” అనే ట్యాగ్‌లైన్ ఆయన పాత్రలోని ఆలోచనా విధానాన్ని మరింత ఆసక్తికరంగా తెలియజేస్తోంది.

‘డీజే టిల్లు’తో తనదైన క్యారెక్టరైజేషన్, హ్యూమర్‌తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు విమల్ కృష్ణ ‘అనుమాన పక్షి’తో మరో వైవిధ్యమైన కాన్సెప్ట్‌ను తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రంలో మెరిన్ ఫిలిప్ కథానాయికగా నటిస్తుండగా, ప్రిన్స్ సెసిల్, రాశి, అనన్య, చరిత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సినిమాటోగ్రాఫర్ సునీల్ కుమార్ నామా, శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ అందిస్తున్నారు. జేకే మూర్తి ఆర్ట్ డైరెక్టర్‌గా, అభినవ్ కునపరెడ్డి ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

ఇప్పటికే టీజర్, విభిన్నమైన ప్రమోషనల్ కంటెంట్‌తో ఆసక్తిని పెంచిన ఈ చిత్రం మరో మూడు వారాల్లో థియేటర్లలోకి రానుంది. మేకర్స్ ప్రమోషన్స్‌ను మరింత ముమ్మరం చేయనున్నారు.

తారాగణం: రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్, ప్రిన్స్ సిసిల్, అనన్య, చరిత్, బ్రహ్మాజీ, రాసి, అజయ్, మస్త్ అలీ

సాంకేతిక సిబ్బంది:
రచన & దర్శకత్వం: విమల్ కృష్ణ
నిర్మాతలు: రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హీరాచంద్ దండ్
సహ నిర్మాత: భరత్ లక్ష్మీపతి
ప్రొడక్షన్ హౌస్: చిలక ప్రొడక్షన్స్
సంగీతం: శ్రీచరణ్ పాకాల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రశాంత్ మండవ
క్రియేటివ్ ప్రొడ్యూసర్: శ్రావణ్ కుప్పిలి
డిఓపి: సునీల్ కుమార్ నామా
ఆర్ట్ డైరెక్టర్: JK మూర్తి
ఎడిటర్: అభినవ్ కునపరెడ్డి
PRO: వంశీ శేఖర్
మార్కెటింగ్: వాల్స్ అండ్ ట్రెండ్స్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.