‘ఫీనిక్స్ రాజా’ పవర్ఫుల్ ఫస్ట్ పోస్టర్ రిలీజ్
ప్రముఖ దర్శకుడు శ్రీవాస్ తన ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రకటించారు. మహంకాళి నాగరాజు నిర్మాణంలో, మాధవి క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘ఫీనిక్స్ రాజా’ అనే టైటిల్ ఖరారు చేశారు. అరిగపూడి సుమిత్ కుమార్, శైలేష్ భంబురే, శ్యామ్ బొడపాటి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.ముంబైలోని జుహూలో నోవాటెల్ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో ‘ఫీనిక్స్ రాజా’ ఫస్ట్ పోస్టర్‌తో పాటు రెండు నిమిషాల పవర్ఫుల్ 2D మోషన్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ ప్రమోషనల్ కంటెంట్‌ను కార్యక్రమానికి హాజరైన మీడియా ప్రతినిధుల చేతుల మీదుగానే ఆవిష్కరించడం విశేషం. ఇంగ్లిష్తో పాటు పలు భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని భారత్‌లోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల్లోనూ భారీ స్థాయిలో తెరకెక్కించనున్నారు. వాస్తవ సంఘటనలను, ప్రభావవంతమైన కథనంతో…
